మోదీ చర్యలు ఫలప్రదం ఎంపీ శశిథరూర్​

Modi's actions are fruitful: MP Shashi Tharoor

Mar 19, 2025 - 13:00
 0
మోదీ చర్యలు ఫలప్రదం ఎంపీ శశిథరూర్​

తిరువనంతపురం: ఉక్రెయిన్​ జెలెన్స్కీ, రష్​యా వ్లాదిమిర్​ పుతిన్​ లకు ప్రధాని మోదీ అంటే అత్యంత గౌరవమని, ప్రధాని మోదీ శాంతి చర్చలు ఫలప్రదం అవుతూ యుద్ధఘంటికలు నిలిచిపోనున్నాయని ఎంపీ శశిథరూర్​ అన్నారు. బుధవారం కేరళ తిరువనంతపురంలో జరిగిన ఓ కార్యక్రమంలో థరూర్​ విలేఖరులు అడిగిన ప్రశ్నలకు సమాధానం ఇచ్చారు. జెలెన్స్కీ, పుతిన్​ లను ఆలింగనం చేసుకున్న నేత ప్రధాని మోదీ అన్నారు. శాంతిని నెలకొల్పేందుకు అన్ని రకాల ప్రయత్నాలను చేశారన్నారు. రెండు దేశాలు కూడా మోదీ ప్రతిపాదనను అంగీకరించారని చెప్పారు. నాటో పంపించే శాంతి పరిరక్షక దళాలను రష్​యా అంగీకరించే పరిస్థితుల్లో లేనందున భారత్​ నుంచి శాంతి పరిరక్షక దళాలు వెళ్లే ఆస్కారం కూడా ఉందన్నారు. ఉక్రెయిన్​ పై భారతదేశ వైఖరిని విమర్శించిన ఎంపీని కూడా తానేనని, అప్పటి వ్యాఖ్యల పట్ల సిగ్గుపడుతున్నానని వ్యాఖ్యనించారు. కాగా శశిథరూర్​ వ్యాఖ్యలపై ఓ వైపు బీజేపీ నాయకులు హర్షం వ్యక్తం చేస్తుండగా, మరోవైపు కాంగ్రెస్​ నేతలకు ఆగ్రహం తెప్పిస్తున్నాయి.