ఎనిమిదోసారి బడ్జెట్ ప్రవేశపెట్టనున్న మంత్రి నిర్మలా సీతారామన్
Minister Nirmala Sitharaman will present the budget for the eighth time

నా తెలంగాణ, న్యూ ఢిల్లీ: కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ శనివారం ఉదయం 8.45 నిమిషాలకు తన ఇంటి నుంచి బడ్జెట్ ప్రవేశపెట్టేందుకు బయలుదేరారు. అనంతరం ఆర్థిక శాఖకు చేరుకొని అరగంటపాటు మంత్రివర్గంలో పలువురు ఉన్నతాధికారులతో భేటీ అయ్యారు. అక్కడి నేరుగా రాష్ర్టపతి భవన్ కు చేరుకున్నారు. అధ్యక్షురాలు ద్రౌపదీ ముర్మూను కలుసుకొని బడ్జెట్ కాపీని అందించి బడ్జెట్ ప్రవేశపెట్టేందుకు ఆమోదం తీసుకున్నారు. 10.30 గంటలకు మంత్రివర్గ సమావేశంలో పాల్గొన్నారు. ఈ సమావేశంలో ప్రధానితోపాటు కేంద్రమంత్రులు పాల్గొన్నారు. కేబినెట్ లో బడ్జెట్ కు ఆమోదముద్ర లభించింది. ఉదయం 11 గంటల నుంచి బడ్జెట్ ను పార్లమెంట్ లో మంత్రి నిర్మల ప్రవేశపెట్టనున్నారు.
మంత్రి నిర్మలా సీతారామన్ ఎనిమిదోసారి ప్రవేశపెట్టనున్న బడ్జెట్ సందర్భంగా బిహార్ లోని 2021 పద్మ శ్రీ అవార్డు గ్రహీత దులారీ దేవి అందించిన చీరను మధుబని చీరను ధరించారు.