హరియాణాలో ఘోర రోడ్డు ప్రమాదం 13మంది గల్లంతు.. ఒకరి మృతి
13 people lost their lives in a serious road accident in Haryana.. one died

కొనసాగుతున్న రెస్క్యూ చర్యలు
ప్రమాదానికి పొగమంచే కారణం
డ్రైవర్ పరారీ
చండీగఢ్: హరియాణా ఫతేహాబాద్ లో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. శుక్రవారం అర్థరాత్రి క్రూజర్ వాహనం పొగమంచు కారణంగా లోయ కాలువలో పడింది. వాహనంలో ప్రయాణిస్తున్న 12 నుంచి 13 మంది గల్లంతయ్యారు. 10ఏళ్ల బాలున్ని స్థానికులు రక్షించి పోలీసులకు సమాచారం అందజేశారు. స్థానికుల సహాయంతో పోలీసులు శనివారం కూడా రెస్క్యూ చర్యలు కొనసాగిస్తున్నారు. గల్లంతైన వారిలో 55 ఏళ్ల వ్యక్తి మృతదేహాన్ని కనుగొన్నారు. మిగతావారి కోసం రెస్క్యూ చర్యలు కొనసాగుతున్నాయి. పోలీసుల కథనం ప్రకారం మహ్మదా గ్రామానికి చెందిన కొందరు పంజాబ్ లో పెళ్లివిందుకు వెళ్లారు. తిరుగు ప్రయాణంలో రాతియా గ్రామం ఖాయ్ మీదుగా సర్దారేవాలా వైపు వస్తుండగా భాక్రా కెనాల్ వంతెనపై దట్టమైన పొగమంచు కారణంగా క్రూయిజర్ వాహనం అదుపు తప్పి కాలువలో పడింది. ప్రమాదానికి గురయ్యే ముందే డ్రైవర్ కారులో నుంచి దూకి పరారైనట్లు పోలీసులు తెలిపారు. ప్రమాదాన్ని గుర్తించిన గ్రామస్థులు పెద్ద ఎత్తున సంఘటనా స్థలానికి చేరుకొని సహాయక చర్యలు చేపడుతూనే పోలీసులకు ఫిర్యాదు చేశారని చెప్పారు. ప్రమాదంపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు.