ఐఈడీ పేలుడు జవాన్ కు తీవ్రగాయాలు
The IED explosion seriously injured the jawan
రాంచీ: ఐఈడీ పేలుడులో కోబ్రా బెటాలియన్ కు చెందిన ఓ జవానుకు తీవ్ర గాయాలయ్యాయి. అతన్ని వెంటనే ఏయిర్ లిఫ్ట్ చేసి రాంచీకి తరలించారు. గురువారం ఝార్ఖండ్ లోని పశ్చిమ సింగ్ భూబ్ జిల్లా సరండాలో మావోయిస్టులప సెర్చ్ ఆపరేషన్ నిర్వహిస్తున్నారు. వేకువజామున జరిగిన ఈ సెర్చింగ్ ఆపరేషన్ లో కోబ్రా బెటాలియన్ కు చెందిన ఓ సైనికుడు ఐఈడీపై కాలు మోపడంతో తీవ్రంగా గాయపడ్డాడు. ఈ విషయంపై మరిన్ని వివరాలను ఎస్పీ అశుతోష్ శేఖర్ అందించారు. జవాన్ ను మెరుగైన చికిత్సకోసం రాంచీకి తరలించామని తెలిపారు. ఝార్ఖండ్ ప్రభుత్వం మావోలకు వ్యతిరేకంగా ప్రచారం నిర్వహిస్తోంది. మావోలు లొంగిపోవాలని వారు కూడా సామాన్య ప్రజా జీవనంలో మమేకం కావాలని ప్రయత్నిస్తోంది. వారి పునరావాసం రివార్డ్ ను కూడా అందజేస్తోంది. ఆయుధాలు సమర్పించిన నలుగురు మావోలకు వారి పునరావాసం కింద రూ. 15, 10, 5 లక్షల చెక్కులను ఛత్రా పోలీసు కార్యాలయంలో అందించారు.