అజ్మీర్ దర్గా పిటిషనర్ గుప్తాపై కాల్పులు
Ajmer Dargah petitioner Gupta fired
తృటిలో తప్పిన ప్రాణాపాయం
జైపూర్: అజ్మీర్ దర్గా పిటిషనర్, హిందూ సేన జాతీయ అధ్యక్షుడు విష్ణు గుప్తాపై గుర్తు తెలియని దుండగులు కాల్పులకు పాల్పడ్డారు. ఈ కాల్పుల్లో ఆయన తృటిలో తప్పించుకున్నారు. వెంటనే పోలీసులను ఆశ్రయించారు. శనివారం ఉదయం అజ్మీర్ నుంచి ఢిల్లీ వెళుతుండగా బైక్ పై ఆయన కారును వెంబడించిన దుండగులు గగ్వానా లాల్ పూరా కల్వర్ట్ వద్ద కాల్పులకు తెగబడ్డారు. సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకొని కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. గుప్తా అజ్మీర్ దర్గా కాంప్లెక్స్ లో హిందూ దేవాలయం ఉందని వ్యాఖ్యలు చేశారు. కోర్టులో పిటిషన్ కూడా దాఖలు చేశారు. దీంతో గుప్తాకు పలుమార్లు బెదిరింపులు వచ్చాయి. శుక్రవారం కూడా చంపేస్తామని బెదిరింపులు వచ్చినట్లు గుప్తా పోలీసులకు తెలిపారు. గుర్తుతెలియని దుండగులు కాల్పులు జరిపి పారిపోయారని స్థానిక సీఐ రామచంద్ర తెలిపారు. ఘటనా స్థలంలో ఎఫ్ ఎస్ ఎల్ బృందాన్ని పిలిచి ఆధారాలు సేకరిస్తున్నామన్నారు. సీసీ టీవీ ఫుటేజ్ లను పరిశీలిస్తున్నామని నిందితులు వెళ్లన రహదారిపై పోలీసులు అప్రమత్తం చేశామన్నారు. త్వరలోనే నిందితులను పట్టుకుంటామని రామచంద్ర తెలిపారు.