మహింద రాజక్సే కుమారుడు అరెస్ట్
ఆస్తి కొనుగోలులో అవినీతి ఆరోపణలు
కొలంబో: శ్రీలంక మాజీ అధ్యక్షుడు మహింద రాజపక్సే కుమారుడు, మాజీ మంత్రి యోషిత రాజపక్సే అవినీతి ఆరోపణలపై శనివారం అరెస్టు చేశారు. ఆస్తి కొనుగోలు కేసులో యోషితపై అవినీతికి పాల్పడ్డారనే ఆరోపణలున్నాయి. ఈ విషయమై అతడిని విచారిస్తున్నారు. దీంతో శ్రీలంక రాజకీయాల్లో ఈ విషయం హాట్ టాపిక్ గా మారి రాజకీయ ప్రకంపనలు రేపుతుంది. గతంలో యోషిత నావికాదళ అధికారిగా పనిచేశారు 2015కి ముందు తన తండ్రి అధ్యక్షుడిగా ఉన్న సమయంలో ఆస్తి కొనుగోలు అవకతవకలు జరిగినట్లు ఆరోపణలు ఎదుర్కొంటున్నారు. యోషిత మామ మాజీ అధ్యక్షుడు గోటబయ రాజపక్సేను కూడా పోలీసులు గత వారం ఇదే విషయమై ప్రశ్నించారు. గత నెలలో మహింద రాజపక్సే భద్రతను కుదించారు. దీంతో సుప్రీంకోర్టును కూడా రాజపక్సే ఆశ్రయించారు.