బీజేపీ మూడో మేనిఫెస్టో జారీ

BJP's third manifesto issued

Jan 25, 2025 - 17:04
 0
బీజేపీ మూడో మేనిఫెస్టో జారీ

కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్​ షా
1.08 లక్షల మంది సలహాలు తీసుకున్నాం
ప్రజా ఆకాంక్షలను నెరవేరుస్తాం
అడుగడుగునా కేజ్రీవాల్​ అవినీతి
మభ్యపెట్టి అధికారంలోకి ఆప్​ 

నా తెలంగాణ, న్యూ ఢిల్లీ: ఢిల్లీ ప్రజల ఆకాంక్షలను నెరవేర్చేందుకు మూడో బీజేపీ మేనిఫెస్టోతో ప్రజలముందుకు వస్తున్నామని కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్​ షా అన్నారు. హామీలపై అన్ని వర్గాల ప్రజలతో లక్షా 8 వేల సలహాలు తీసుకున్నామన్నారు. కేజ్రీవాల్​ ఇచ్చిన హామీలను మరిచి తన బంగ్లా నిర్మాణంలో అలంకరణకే 51 కోట్లను కేటాయించారని, యమునా నది ప్రక్షాళన, మురికివాడ వాసులకు శాశ్వత గృహాలు హామీలతో ప్రజలను మభ్యపెట్టి అధికారంలోకి వచ్చారని మండిపడ్డారు. 

కుంభకోణాల పార్టీ ఆప్​..
శనివారం మూడో బీజేపీ మేనిఫెస్టోను ఢిల్లీ బీజేపీ కార్యాలయంలో విడుదల చేశారు. అనంతరం మీడియాతో మాట్లాడుతూ ఆప్​ అధినేత కేజ్రీవాల్​ పాలన తీరును ఎండగట్టారు. తమ మేనిఫెస్టో విశ్వాసం, నమ్మకాలపై ఆధారపడి ఉందన్నారు. ఇచ్చిన మాటను తప్పక నెరవేర్చే పార్టీయే బీజేపీ అని షా పేర్కొన్నారు. కేజ్రీవాల్​ కేవలం వాగ్ధానాలు మాత్రమే చేస్తారని వాటిని నెరవేర్చని విమర్శించారు. కేజ్రీవాల్​ చివరకు పాఠశాలలు, దేవాలయాలు, గురుద్వారాలలో కూడా అవినీతికి పాల్పడ్డారని తెలిపారు. ఎక్కడికక్కడ మద్యం దుకాణాలు తెరిచి అందులోనూ భారీ అవినీతికి పాల్పడి జైలు పాలయ్యారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఢిల్లీని కాలుష్య రహితంగా మారుస్తానని ఎప్పటి నుంచో మభ్యపెడుతూ అధికారంలోకి వస్తూ కాలుష్యం, యమునాను స్వచ్ఛంగా తీర్చిదిద్దడమే మర్చి పోయారని మండిపడ్డారు. ఢిల్లీకి దళిత ఉప ముఖ్యమంత్రిని ఇస్తానని వాగ్ధానం చేసి ఆ పదవిని ఇవ్వకుండా దళితులను కూడా మోసం చేసిన చరిత్ర కేజ్రీవాల్​ దేనని అమిత్​ షా మండిపడ్డారు. రూ.5400 కోట్ల రేషన్ పంపిణీ కుంభకోణం, రూ.4500 కోట్ల బస్సు కుంభకోణం, రూ.571 కోట్ల సీసీటీవీ కుంభకోణం, రూ.2800 కోట్ల విలువైన జల్ నిగమ్ కుంభకోణం, 65 వేల నకిలీ వైద్య పరీక్షల కుంభకోణం ఇలా ఆయన పాలనంతా కుంభకోణాలతో నిండి ఉందని ఆగ్రహం వ్యక్తం చేశారు. 

ఢిల్లీ అభివృద్ధికి బీజేపీ నిధుల కేటాయింపు..
ఢిల్లీ అభివృద్ధికి బీజేపీ పాటుపడిందని రైల్వేలకు రూ. 15వేల కోట్లు, విమానాశ్రయాలకు రూ.21 వేల కోట్లు, రోడ్లకు రూ.41 వేల కోట్లు ఖర్చు చేశామని తెలిపారు. అన్న యోజనలో 73 లక్షల మంది లబ్ధిదారులకు, వీధి వ్యాపారుల 2.5 లక్షల మంది లబ్ధిదారులకు రుణాలు, 488 షాపుల్లో తక్కువ ధరకే మందులు ఇచ్చే ఏర్పాటు చేశామన్నారు. శ్రమ యోగి మానవ్ ధన్ ద్వారా 11 వేల మంది సబ్‌స్క్రైబర్‌లను పొందారు. జన్ ధన్ యోజన కింద 65 లక్షల ఖాతాలు తెరవగా, ఉజాలా పథకం కింద కోటి 30 లక్షల బల్బులను పంపిణీ చేశామని చెప్పారు. 

బీజేపీ మూడో మేనిఫెస్టో..

– 1700 అక్రమ కాలనీల్లో నివసించే వారికి పూర్తి యాజమాన్య హక్కులు.
–  సీల్​ చేసిన 13000 దుకాణాలను ఆరు నెలల్లోనే తిరిగి తెరిచేలా చర్యలు.
– శరణార్థుల కాలనీకి చెందిన లీజు ఆస్తిని యజమానిగా చేస్తారు.
– గిగ్ వర్కర్లకు రూ.10 లక్షల వరకు జీవిత బీమా, రూ5 లక్షల వరకు ప్రమాద బీమా.
– వస్త్ర కార్మికులకు రూ.10 లక్షల వరకు జీవిత బీమా.
– రూ. 5 లక్షల వరకు ప్రమాద బీమా, రూ.15,000 టూల్‌కిట్ ప్రోత్సాహకం.
– నిర్మాణ కార్మికులకు టూల్‌కిట్ ప్రోత్సాహకం కోసం రూ.10,000. రూ. 3 లక్షల వరకు ఋణం, రూ. 5 లక్షల వరకు ప్రమాద బీమా, రూ. 10 లక్షల వరకు జీవిత బీమా.
– యువతకు 50,000 ప్రభుత్వ ఉద్యోగాలు, 20 లక్షల ఉపాధి, స్వయం ఉపాధి అవకాశాలు, నిరుపేద విద్యార్థులకు మెట్రోలో ఉచిత ప్రయాణం కోసం ఎన్​ సీఎంసీలో సంవత్సరానికి రూ. 4000.
– గుర్తింపు పొందిన మీడియా వ్యక్తులు, న్యాయవాదులకు రూ. 10 లక్షల వరకు జీవిత బీమా, రూ. 10 లక్షల వరకు ఆరోగ్య, ప్రమాద బీమా.
– రూ. 20,000 కోట్ల పెట్టుబడితో ఇంటిగ్రేటెడ్ పబ్లిక్ ట్రాన్స్‌పోర్ట్ నెట్‌వర్క్, ఢిల్లీ 100శాతం ఇ-బస్ సిటీగా మార్పు, మెట్రోఫేజ్ 4 పనులు త్వరలో పూర్తి, 24 గంలు అందుబాటులోకి మెట్రో సేవలు. 
– యమునా నది ప్రక్షాళన, అభివృద్ధి. 
– మాన్యువల్ స్కావెంజింగ్ 100శాతం తొలగింపు, కార్మికులకు నైపుణ్యాభివృద్ధి, ఉపాధి అవకాశాల కల్పన. 
– 50,000 ప్రభుత్వ పోస్టులు పారదర్శకంగా భర్తీ, 20 లక్షల స్వయం ఉపాధి అవకాశాల సృష్టి. 
–  అధికారంలోకి రాగానే తొలికేబినెట్​ సమావేశంలోనే ఆయుష్మాన్​ భవ అమలు  నిర్ణయం.