అడవి బిడ్డల హక్కులను కాపాడేందుకే లోక్​ మంథన్​ 

కేంద్ర బొగ్గు, గనుల శాఖ మంత్రి జి.కిషన్​ రెడ్డి

Jan 19, 2025 - 13:26
Jan 19, 2025 - 13:36
 0
అడవి బిడ్డల హక్కులను కాపాడేందుకే లోక్​ మంథన్​ 

నగరంలో లోక్​ మంథన్​ నిర్వహణ విజయవంతం
విద్యార్థుల్లో జాతీయ భావాలు, సంస్కృతిని కాపాడే ప్రయత్నంలో విజయం
తల్లిదండ్రులు, విద్యార్థులు, విద్యా సంస్థలు, మీడియాకు కృతజ్ఞతలు

నా తెలంగాణ, హైదరాబాద్​: అడవుల్లో జీవించే వారి జీవన విధానాలు, వారి హక్కులను కాపాడేందుకు విద్యార్థులను మేలుకొలపాలనే ఉద్దేశ్యంతో లోక్​ మంథన్​ కార్యక్రమాన్ని విజయవంతంగా హైదరాబాద్​ లో నిర్వహించడం గర్వకారణమని తెలంగాణ రాష్​ర్ట బీజేపీ అధ్యక్షుడు, కేంద్ర బొగ్గు గనుల శాఖ మంత్రి జి.కిషన్​ రెడ్డి అన్నారు. ఆదివారం అబిడ్స్​ లోని స్టాన్లీ కాలేజీలో నిర్వహించిన లోక్​ మంథన్–2024 సక్సెస్​ మీట్​ లో ముఖ్య అతిథిగా పాల్గొన్న కేంద్ర మంత్రి జి.కిషన్​ రెడ్డి మాట్లాడారు. జాతీయ స్థాయి మహాసభలు హైదరాబాద్​ లో జరగడం అభినందనీయమన్నారు. ఇందుకు సహకరించిన విద్యార్థులు, వారి తల్లిదండ్రులు, ఉపాధ్యాయులు, సామాజిక సంస్థలు, మీడియాకు కృతజ్ఞతలు తెలిపారు. లోక్​ సభ ప్రాంగణంలో ఏర్పాటు చేసిన అనేక రకాల ఎగ్జిబిషన్స్​ లో నగరంలోని వివిధ విద్యా సంస్థలు స్వచ్ఛందంగా తమ 3 లక్షల మంది విద్యార్థులను పంపడం అభినందనీయమన్నారు. ఈ విద్యార్థులు అక్కడ నిర్వహించిన ఎగ్జిబిషన్​ స్టాల్స్​ ను తిలకించారన్నారు. లోక్​ మంథన్​ ద్వారా విద్యార్థుల్లో జాతీయ భావాన్ని పెంపొందించాలని, భారతీయ సంస్కృతి, సాంప్రదాయాలను రక్షించాలనే ఉద్దేశ్యంతో ఈ కార్యక్రమం నిర్వహిస్తున్నామని కేంద్ర మంత్రి జి.కిషన్​ రెడ్డి స్పష్టం చేశారు.