ఓటేశాకే వీడ్కోలు చెప్పండి తేల్చిచెప్పిన నవవధువు!
After voting, she goes to her mother-in-law's house New bride who decided
పాట్నా: నూతన వధువు అత్తారింటికి వీడ్కోలుకు వెళ్లేముందు ఓటు వేస్తానని అప్పుడే తనకు వీడ్కోలు పలకాలని మొండికేసింది. దీంతో వధువును మొదటగా ఓటు వేయించిన అనంతరం అత్తారింటికి సాగనంపారు. ఈ ఆసక్తికర ఘటన బిహార్ కతిహార్ పార్లమెంట్ నియోజకవర్గంలో జరిగింది. వధువు శ్వేతా చంద్రవంశీ కి గురువారం రాత్రి పెళ్లి జరిగింది. శుక్రవారం ఉదయం వీడ్కోలు కార్యక్రమానికి సిద్ధమయ్యారు. ఈ లోపు వధువు శ్వేతా తాను ఓటు వేయందే అత్తారింటికి వెళ్లబోనని తేల్చి చెప్పింది. దీంతో వరుడితోపాటు మరో ఇద్దరు బంధువులతో కలిసి పోలింగ్ కేంద్రం 223కు వెళ్లి శ్వేత తన ఓటు హక్కును వినియోగించుకుంది.