కుంభమేళా తొక్కిసలాట..గుంపులో ఇద్దరు?
Kumbh Mela stampede..two in the group?

ఫోన్లు స్విచ్ ఆఫ్
కుట్రకోణంలో ఎస్టీఎఫ్ ఆరా, పలు అనుమానాలు
లక్నో: మహాకుంభంలో తొక్కిసలాట కుట్ర జరిగిందా? ప్రణాళిక ప్రకారమే కుట్రకు తెరతీశారా? అంటే యూపీ ఎస్టీఎఫ్ దర్యాప్తు తీరు పలు అనుమానాలను రేకెత్తిస్తున్నాయి. మౌనీ అమావాస్య రాత్రి 1.30 గంటలకు ఘాట్ వద్ద ఇద్దరు వ్యక్తులు కాషాయ జెండాను చేతబూని గుంపులోకి ప్రవేశించారని గుర్తించారు. ఈ సమయంలోనే తొక్కిసలాట ప్రారంభమైందని గుర్తించారు. సీసీటీవీల ఫుటేజ్ ఆధారంగా దర్యాప్తులు ఈ విషయం వెల్లడైనట్లు పలువురు అధికారులు వివరించారు.
ఆ సమయంలో ఆ ప్రాంతంలో యాక్టివ్ గా ఉన్న మొబైల్ ఫోన్ లు కూడా స్విచ్ ఆఫ్ లో ఉండడం కూడా అనుమానాలు రేకెత్తించేందుకు కారణమవుతుంది. ప్రస్తుతానికి ఇప్పుడిప్పుడే ఏమీ చెప్పలేమని పూర్తి దర్యాప్తు జరుగుతుందని, మొబైల్ ఫోన్లు బాధితులవా, లేదా ఎవరైనా భక్తులవి పోయాయా? పడిపోతే ఆ ఫోన్లు, సిమ్ లు వాడే వారెవరు? ప్రస్తుతం ఎక్కడ ఉన్నారు? లాంటి వివరాలను ఎస్టీఎఫ్ పోలీసులు కూపీ లాగుతున్నారు. కాగా ఘటన అనంతరం యూపీ డీజీపీ ప్రశాంత్ కుమార్ మాట్లాడుతూ ఇందులో కుట్ర కోణం కనిపించడం లేదన్నారు. అయినా దర్యాప్తు అనంతరమే పూర్తి వివరాలు వెల్లడవుతాయని తెలిపారు.
తొక్కిలాటలో 30 మంది మృతి చెందగా, 60 మందికి గాయాలయ్యాయి. ప్రయాగ్ రాజ్ ఆసుపత్రిలో 33 మందికి ఇంకా చికిత్సలు కొనసాగుతున్నాయి. వీరిని కూడా దర్యాప్తు బృందాలు దశల వారీగా విచారించి ఫోన్ నెంబర్లు, తొక్కిసలాటకు కారణాలపై ఆరా తీస్తున్నారు. తొక్కిసలాట అనంతరం కూడా భారీగా భక్తులు ప్రయోగ్ రాజ్ త్రివేణి సంగమంలో పుణ్య స్నానాలు ఆచరించేందుకు వస్తున్నారు. దీంతో శనివారం (ఫిబ్రవరి) వరకు 35 కోట్లమందికి పైగా భక్తులు పుణ్య స్నానాలు ఆచరించగా ఆదివారం రెండుకోట్ల మంది వరకు భక్తులు పుణ్యస్నానాలు ఆచరించే అవకాశం ఉందని భావిస్తున్నారు.