కూలిన యుద్ధ విమానం
Crashed fighter jet

చండీగఢ్: హరియాణాలోని పంచకులలో భారత వైమానిక దళం జాగ్వార్ యుద్ధ విమానం కూలిపోయింది. అంబాలా ఎయిర్ బేస్ నుంచి శుక్రవారం బయలుదేరిన విమానం సాంకేతిక సమస్య తలెత్తడం వల్ల కుప్పకూలింది. విమానం కూలే ముందే పైలెట్ బయటికి రావడంతో ప్రాణపాయం తప్పింది. ప్రమాద విషయం తెలుసుకున్న వైమానిక దళ అధికారులు దర్యాప్తునకు ఆదేశాలు జారీ చేశారు. పంచకుల కొండ ప్రాంతంలోని మోర్ని బాల్ద్వాలా గ్రామ సమీపంలో విమానం కూలిపోయిందన్నారు. పారాచూట్ సహాయంతో పైలెట్ తప్పించుకోగలిగాడని చెప్పారు. ఈ ప్రమాదంలో ఎటువంటి ప్రాణనష్టం జరగలేదని అధికారులు వివరించారు. వివరాలు అందుకున్న పోలీసులు వెంటనే ప్రమాద స్థలికి చేరుకొని సహాయక చర్యలు చేపట్టారు.