ఇమ్రాన్​, భార్య బుష్రాకు జైలు శిక్ష

Jail sentence for Imran and his wife Bushra

Jan 17, 2025 - 13:21
 0
ఇమ్రాన్​, భార్య బుష్రాకు జైలు శిక్ష

ఇస్లామాబాద్​: పాక్​ మాజీ ప్రధానమంత్రి ఇమ్రాన్​ ఖాన్​ కు 14ఏళ్ల జైలు శిక్ష, ఆయన భార్య బుష్రా బీబీకి ఏడేళ్ల జైలు శిక్ష ను పాక్​ కోర్టు విధించింది. 90 మిలియన్ పౌండ్ల అల్-ఖాదిర్ ట్రస్ట్ కేసులో అవినీతికి పాల్పడిన మాజీ ప్రధాని ఇమ్రాన్ ఖాన్, అతని భార్య బుష్రా బీబీకి పాకిస్థాన్ కోర్టు శుక్రవారం అవినీతి నిరోధక న్యాయస్థానం తీర్పును వెలువరించింది. జనవరి 13నే వీరిద్దరిని దోషులుగా తీర్పు చెప్పారు. శిక్షను వాయిదా వేశారు. ఆదిలా జైలులో ఏర్పాటు చేసిన తాత్కాలిక కోర్టులోనే న్యాయమూర్తి తీర్పును వెల్లడించడం గమనార్హం. 

2023లో ఇమ్రాన్​ ఖాన్​ పై అవినీతికి సంబంధించిన కేసు నమోదైంది. నేషనల్ అకౌంటబిలిటీ బ్యూరో (ఎన్​ ఎబీ) 2023 డిసెంబర్‌లో ఖాన్, 72, బుష్రా బీబీ, మరో ఆరుగురిపై జాతీయ ఖజానాకు 190 మిలియన్ పౌండ్ల (పీఆర్​50 బిలియన్) నష్టం కలిగించారని ఆరోపించింది. ఈ కేసులో మిగతా వారంతా దేశం బయట ఉండడంతో ఖాన్​, ఆయన భార్యపై విచారణ జరిపి దోషులుగా తేల్చి శిక్షలు ఖరారు చేసింది. మరోవైపు ఈ తీర్పుపై ఇమ్రాన్​ ఖాన్​ తరఫు న్యాయవాది మాట్లాడుతూ.. పై కోర్టును ఆశ్రయిస్తామన్నారు. అక్కడ తమకు న్యాయం జరుగుతుందన్నారు.