కృత్రిమ గుండెతో జీవనం సాధ్యమే!
Life with an artificial heart is possible!

నా తెలంగాణ, సెంట్రల్ డెస్క్: తొలిసారిగా కృత్రిమ గుండెతో 40 ఏళ్ల వ్యక్తి వందరోజులపాటు జీవించాడు. ఆస్ట్రేలియాలోని సిడ్నీ విన్సెంట్ ఆసుపత్రి వైద్యులు గుండెపోటు వచ్చి పూర్తిగా గుండె చెడిపోయిన వ్యక్తిని వందరోజులపాటు బతికించి సత్తా చాటారు. ఈ ప్రయోగం భవిష్యత్ లో మానవుడి గుండెకు మరింత పదిలం చేసేలా కొనసాగింది. 2024లో ఓ వ్యక్తికి తీవ్ర గుండెపోటు సంభవించింది. ఆ వ్యక్తి విన్సెంట్ ఆసుపత్రికి చేరుకున్నాడు. అతనికి గుండె మార్పిడి చేయాలని వైద్యులు నిర్ణయించారు. అలా అయితేనే ఆ వ్యక్తి బతికే అవకాశం ఉందని అన్ని వైద్య పరీక్షలు నిర్వహించిన అనంతరం నిర్దరించారు. కానీ అప్పటికప్పుడు ఆ వ్యక్తితో సరిపోలిన హృదయం లభ్యం కాలేదు. దీంతో వైద్యులు కృత్రిమ గుండెవైపు ఆలోచించి ఛాలెంజ్ గా తీసుకొని ఆపరేషన్ ను విజయవంతం చేశారు. కానీ రోగికి అమర్చిన తాత్కాలిక గుండె వందరోజులపాటు తన పనితీరును కొనసాగించగలిగింది. అనంతరం ఆ వ్యక్తి ఇతర రుగ్మతల కారణంగా మృతి చెందాడు. కానీ వైద్యశాస్ర్తంలో, పరిభాషలో ప్రపంచంలోనే కృత్రిమ గుండెతో వందరోజులపాటు బతికిన వ్యక్తిగా ఆ వ్యక్తి పేరు పొందాడు. ఈ కృత్రిమ గుండెను ఆస్ర్టేలియాలోని మోనాష్ విశ్వవిద్యాలయం రూపొందించింది.
ఎవరు రూపొందించారు?..
ఈ గుండెను క్విన్స్ ల్యాండ్ లోని బయో ఇంజనీర్ డేనియల్ టిమ్స్ 20 సంవత్సరాల క్రితమే రూపొందించాడు. అతని తండ్రి గుండెపోటుతో మృతిచెందడంతో కృత్రిమ గుండెవైపు ఇతని ఆలోచనలు మళ్లాయి. పరిశోధనలో విజయం సాధించినా 2024లో వ్యక్తికి తొలిసారి ఈ గుండెను అమర్చారు.
హృదయం..
650 గ్రాముల బరువుండే ఈ హృదయం టైటానియం లోహంతో రూపొందించారు. 12ఏళ్ల వ్యక్తికి కూడా దీన్ని అమర్చేలా రూపొందించారు. గుండె ఏర్పాటు చేశాక సంబంధిత వ్యక్తికి కృత్రిమ గుండెను మోసుకొని తిరుగుతున్నట్లు కూడా తెలియదు. లోపల గుండెను అమర్చినా బయట వ్యక్తి ఛాతీపై ఒక పేస్ మేకర్ లాంటి పరికరం సహాయంతో నడుస్తుంది. పేస్ మేకర్ నుంచి ఒక తీగ నేరుగా లోపలి కృత్రిమ గుండె నడిచేలా చేస్తుంది. ఈ బ్యాటరీ నాలుగు గంటలపాటు నడుస్తుంది. రీచార్జీ కోసం అలర్ట్ కూడా జారీ చేస్తుంది. ఈ గుండె రక్తాన్ని పంప్ చేస్తూ ఉంటుంది.
వైద్యుల అభిప్రాయం..
ఆస్ర్టేలియన్ విక్టర్ చాక్ కార్డియాక్ రీసెర్చ్ ఇన్స్ స్టిట్యూట్ పరిశోధన ప్రకారం ఈ గుండె ద్వారా మనిషి ఆరు సంవత్సరాలపాటు జీవించే అవకాశం ఉంది. మార్పిడి తరువాత 80 నుంచి 85 శాతం మంది రోగులు 12 నెలలపాటు బతికే ఉంటారు. ‘బీవాకోర్ టోటల్’ అనబడే ఈ ఆర్టిఫిషియల్ గుండె ఇప్పటివరకు ఒక్కరోగికి మాత్రమే అమర్చారు. బ్రిటిష్ మ్యాగజైన్ ప్రకారం భవిష్యత్ లో ఈ హృదయం సహాయంతో గుండె మార్పిడి చేసిన వ్యక్తిని బతికించే అవకాశం ఉందేమో గానీ ఆగిపోయిన గుండెను మాత్రం ఇది రీచార్జ్ చేయలేదు.
ప్రపంచవ్యాప్తంగా ప్రతీ ఏటా 23 మిలియన్ల మంది గుండెపోటుతో మృతి చెందుతున్నారు. చాలామందికి గుండె అవసరం ఉన్నప్పటికీ గుండెను అందించే దాతల సంఖ్య మాత్రం ప్రతీఏటా కేవలం ఆరువేలే. భవిష్యత్ లో కృత్రిమ గుండె రూపకల్పనలో మరిన్ని పరిశోధనలు జరగాల్సిన అవసరం ఉంది. దీంతో పెద్ద ఎత్తున గుండెపోటుల నివారణ, బదిలీ సాధ్యపడుతుంది.