భారతీయ నౌక స్వాధీనం ఐదుగురు విడుదల

ఇరాన్​ చెరలో మరో 11మంది భారతీయులు

May 10, 2024 - 13:37
 0
భారతీయ నౌక స్వాధీనం ఐదుగురు విడుదల

నా తెలంగాణ, న్యూ ఢిల్లీ: ఏప్రిల్ 13న సీజ్ చేసిన ఎంఎస్‌సి ఏరీస్ నౌకలో ఉన్న ఐదుగురు భారతీయులను ఇరాన్ విడుదల చేసింది. విడుదలైన వారంతా వారి వారి స్వస్థలాలకు చేరుకున్నారని ఇరాన్‌లోని భారత రాయబార కార్యాలయం గురువారం వెల్లడించింది. సహకరించిన ఇరాన్ అధికారులకు కృతజ్ఞతలు తెలిపారు. కాగా ఇరాన్​ నుంచి వచ్చే భారతీయులంతా శుక్రవారం భారత్​ కు చేరుకోనున్నారు. ఇప్పటికి ఇంకా 11 మంది భారతీయులు ఇరాన్​ చెరలోనే ఉన్నారు. ఏప్రిల్​ 18న భారతీయ మహిళా క్యాడెట్​ ను విడుదల చేశారు. 

ఇరాన్​ స్వాధీనం చేసుకున్న నౌకలో మొత్తం 17 మంది భారతీయులుండగా ఇప్పటివరకు ఆరుగురిని విడుదల చేశారు. మరో 11మంది ఇంకా ఇరాన్​ చెరలోనే ఉన్నారు. వీరంతా త్వరలోనే విడుదల కానున్నట్లు చర్చలు జరుపుతున్నామని భారత విదేశాంగ శాఖ వెల్లడించింది. 
ఇరాన్​ తో దౌత్య మార్గాల ద్వారా సంప్రదింపులు కొనసాగుతున్నాయి. నౌకలోని భారతీయులను కలిసేందుకు ఇరాన్​ గతంలో అనుమతినిచ్చింది.