మోదీ చొరవతో నూతన శిఖరాలకు భారత్​–అమెరికా బంధాలు

అమెరికా రాయబారి ఎరిక్​ గార్సెట్టి

Jan 19, 2025 - 17:57
 0
మోదీ చొరవతో నూతన శిఖరాలకు భారత్​–అమెరికా బంధాలు

నా తెలంగాణ, న్యూ ఢిల్లీ: అమెరికా–భారత్​ బంధాలు జో బైడెన్​ కృషి వల్ల నూతన శిఖరాలకు చేరుకున్నాయని డోనాల్డ్​ ట్రంప్​ నేతృత్వంలో ఈ బంధాలు మరింత బలోపేతం అవుతాయని భారత్​ లోని అమెరికా రాయబారి ఎరిక్​ గార్సెట్టి అన్నారు. ఆదివారం భారత పర్యటన సందర్భంగా ప్రధాని నరేంద్ర మోదీతో గార్సెట్టి సమావేశమయ్యారు. పలు విషయాలపై చర్చించారు. వీసాలు, రక్షణ సహకారం, అంతరిక్షం, విద్యార్థులు, పెట్టుబడులలో ఇరుదేశాలు అనేక మైలురాళ్లను విజయవంతంగా సాధించాయన్నారు. ప్రధాని మోదీతో అనుబంధం గొప్ప నిర్వచనాన్ని ఇచ్చిందన్నారు. ప్రధాని ఆదరణకు కృతజ్ఞతలు తెలిపారు. ఇరుదేశాల నూతనాధ్యాయంలో ప్రధాని మోదీ చొరవ కీలకమైందన్నారు. బెంగళూరులో యూఎస్​ కాన్సులేట్​ ప్రారంభం భారత్​ తో మరిన్ని బంధాల విస్తరణకు నాందీగా గార్సెట్టి అభివర్ణించారు. ప్రధాని నేతృత్వంలో తనను గౌరవించిన ప్రతీ ఒక్కరికి ఎరిక్​ గార్సెట్టి ధన్యవాదాలు తెలిపారు.