కునోలో పెరుగుతున్న చిరుతల సంఖ్య
Increasing numbers of leopards in Kuno

భోపాల్: మధ్యప్రదేశ్ లోని కునో నేషనల్ పార్కులు ఆడ చిరుత ‘వీరా’ రెండు పసికూనలకు జన్మనిచ్చింది. ఈ విషయాన్ని మంగళవారం ఆ రాష్ర్ట ముఖ్యమంత్రి సీఎం మోహన్ యాదవ్ సామాజిక మాధ్యమం వేదికగా పంచుకొని సంతోషం వ్యక్తం చేశారు. దీంతో కునోలో ఉన్న మొత్తం చిరుతల సంఖ్య 26కు చేరుకుంది. ప్రధాని మోదీ నేతృత్వంలో ఏర్పాటైన ‘ఆపరేషన్ చీటా’ ప్రాజెక్టు ద్వారా అంతరించిపోతున్న ఈ చిరుతలకు జీవం పోసినట్లయ్యింది. ప్రత్యేక విమానం ద్వారా నమీబియా, ఆఫ్రికాల నుంచి రెండుదశల్లో చిరుతలున తీసుకువచ్చి కునోలో వదిలారు. వీటి సంఖ్య మరింత పెరగాల్సి ఉన్నా, భారత వాతావరణానికి అలవాటు పడని పలు చిరుతలు మనగలేకపోయాయి. క్రమేణా చిరుతల జీవన శైలిలో మార్పులతో ఇక్కడి వాతావరణానికి పూర్తిగా అలవాటు పడడంతో వీటి మరణాల సంఖ్య తగ్గిందని అధికారులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. ప్రస్తుతం కునోలో 12 పెద్ద చిరుతలు, 14 పిల్ల చిరుతలున్నాయి.