రాహుల్​ ఆరోపణలు అబద్ధాలే

Union Defense Minister Rajnath Singh

Feb 4, 2025 - 16:16
 0
రాహుల్​ ఆరోపణలు అబద్ధాలే

నా తెలంగాణ, న్యూ ఢిల్లీ: రాహుల్​ గాంధీ ఆర్మీ చీఫ్​ పై తప్పుడు ఆరోపణలు చేస్తూ దేశ ప్రయోజనాలకు విఘాతం కలిగిస్తున్నారని కేంద్ర రక్షణ శాఖ మంత్రి రాజ్​ నాథ్​ సింగ్​ మండిపడ్డారు. పూర్తి అవాస్తవాలను మాట్లాడుతున్నారని మండిపడ్డారు. మంగళవారం రాహుల్​ గాంధీ చేసిన ఆరోపణలపై రాజ్​ నాథ్​ సింగ్​ మాట్లాడారు. సరిహద్దులో పెట్రోలింగ్​ అంతరాయం గురించి మాత్రమే ప్రస్తావనకు వచ్చాయన్నారు. ఈ ఆటంకాలను ఇరుదేశాలు సమన్వయంతో పరిష్కరించుకుంటాయన్నారు. 1962, 1963లో భారత భూభాగాన్ని కోల్పోయినప్పుడు ఏ ప్రభుత్వాలు మనుగడలో ఉన్నాయని ప్రశ్నించారు. రాహుల్​ గాంధీ ఆత్మ పరిశీలన చేసుకోవాలన్నారు. ప్రస్తుతం ఆత్మనిర్బర్​ భారత్​ ప్రపంచం ముందు సాక్షాత్కరించిందన్నారు. రాహుల్​, కాంగ్రెస్​ పార్టీల ప్రకటనలు దేశ సైనిక శక్తిని నిర్వీర్యం చేసేలా ఉన్నాయని రాజ్​ నాథ్​ సింగ్​ మండిపడ్డారు.