ఉత్పత్తి సామర్థ్యం పెంపు

మూడో అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా మారనున్నాం మనోరమ న్యూస్​ కాన్​ క్లేవ్​ లో రక్షణ మంత్రి రాజ్​ నాథ్​ సింగ్​

Aug 30, 2024 - 15:56
 0
ఉత్పత్తి సామర్థ్యం పెంపు
తిరువనంతపురం: వేగంగా అభివృద్ధి చెందుతున్న దేశాల్లో భారత్​ ముందువరుసలో ఉందని, దేశంలో ఉత్పత్తి సామర్థ్యాన్ని పెంపొందించామని, మోదీ నేతృత్వంలో మూడో అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా రూపుదిద్దేందుకు పనిచేస్తున్నామని రక్షణ శాఖ మంత్రి రాజ్​ నాథ్​ సింగ్​ అన్నారు. 
 
శుక్రవారం తిరువనంతపురంలో ‘మనోరమ న్యూస్​ కాన్​ క్లేవ్​‌‌2024’లో పాల్గొని మంత్రి రాజ్​ నాథ్​ సింగ్​ ప్రసంగించారు. ప్రపంచ ఆర్థిక వ్యవస్థలలో బలమైన ఆర్థిక వ్యవస్థగా భారత్​ రూపాంతరం చెందిందన్నారు. వ్యాపార, వాణిజ్యాలు, ఉత్పత్తి పెంపు, పరిశ్రమల స్థాపన, పర్యావరణ అనుమతులను సులభతరం చేశామన్నారు. ఇందుకోసం 40వేల కంటే ఎక్కువగా క్లిష్టమైన సమస్యలను పరిష్కరించి సులభతరమైన వ్యాపారం కోసం త్వరగా అనుమతులు వచ్చేలా చేశామన్నారు. 
 
5జీ సేవల విస్తరణలో టెలికాం సంస్థ ఎరిక్సన్​ ఉపాధ్యక్షుడి ప్రశంసలను ప్రస్తావించారు. 5జీలో కూడా భారత్​ యూరోపియన్​ దేశాలను దాటి మూడో దేశంగా అవతరించిందన్నారు. దేశంలో అత్యధికంగా 5జీ వినియోగదారులు నమోదయ్యారని తెలిపారు. 2027నాటికి మూడో అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా అవతరించబోతున్నామని రాజ్​ నాథ్​ సింగ్​ పేర్కొన్నారు. గత దశాబ్ధకాలంలో భారత్​ లో మొబైల్​ ఫోన్​ ఉత్పత్తి ఐదు రెట్లు పెరిగిందని, రెండు లక్షల గ్రామ పంచాయితీలను ఫైబర్​ నెట్​ తో అనుసంధానించామని రాజ్​ నాథ్​ సింగ్​ తెలిపారు.