పుణ్య స్నానాలు @55 కోట్లు!

Holy Baths @55 Crores!

Feb 18, 2025 - 18:35
 0
పుణ్య స్నానాలు @55 కోట్లు!

లక్నో: దేశంలోని 45 శాతం మంది భక్తులు ప్రయాగ్​ రాజ్​ త్రివేణి సంగమంలో ఇప్పటికే పుణ్య స్నానాలు ఆచరించారని లెక్కలు చెబుతున్నాయని అధికారులు చెప్పారు. సోమవారం వరకు 55 కోట్ల మందికి పైగా భక్తులు పుణ్యస్నానాలు ఆచరించారని అన్నారు. ఈ లెక్కన చూస్తే మరో వారం రోజుల్లో ఈ సంఖ్య 60 కోట్లకు పైగా చేరుకుంటుందని అన్నారు. చివరి రోజులు కావడంతో భారీగా భక్తులు పుణ్య స్నానాలకు పోటెత్తుతున్నారని తెలిపారు. మరోవైపు ప్రయాగ్​ రాజ్​ కు వచ్చే రైళ్లన్నీ భక్తులతో కిటకిటలాడుతున్నాయి. 12 గంటలపాటు ఆలస్యంగా నడుస్తున్నాయి. ఇప్పటికీ 10 కిలోమీటర్ల ముందే వాహనాలను నిలిపివేసే చర్యలు కొనసాగిస్తున్నారు. మరోవైపు కుంభమేళాకు దారితీసే ఎనిమిది దారుల్లోనూ 25 కి.మీ. మేర భారీ ట్రాఫిక్​ జామ్​ లు ఏర్పడ్డాయి. పోలీసులు, అధికారులు, సైన్యం అవాంఛనీయ ఘటనలు చోటు చేసుకోకుండా చర్యలు తీసుకుంటున్నారు. ప్రపంచంలోనే ఇంతపెద్ద ఎత్తున భక్తులు పుణ్య స్నానాలు ఆచరించిన ఉదాహరణలు ఎక్కడా లేవు. 

మహాకుంభమేళా ద్వారా గొప్ప సందేశం: డిప్యూటీ సీఎం పవన్​ కళ్యాణ్​ 

మరోవైపు మంగళవారం ప్రముఖులు త్రివేణి సంగమంలో పుణ్య స్నానం ఆచరించారు. ఏపీ డిప్యూటీ సీఎం పవన్​ కళ్యాణ్​ సతీసమేతంగా పుణ్య స్నానం ఆచరించారు. అనంతరం మీడియాతో మాట్లాడుతూ.. భారత్​ భిన్నత్వంలో ఏకత్వం అన్నారు. వర్గాలు, వర్ణాలు వేరైనప్పటికీ మనమంతా ఒక్కటే అనే గొప్ప సందేశాన్ని మహాకుంభమేళా అందిస్తుందన్నారు. ఇంతగొప్ప అవకాశం తనకు కలిగినందుకు సంతోషంగా ఉందన్నారు.  మాజీ ఉపరాష్ర్టపతి వెంకయ్యనాయుడు పుణ్య స్నానం ఆచరించారు.