హోలీ వేడుకలు.. రూ. 60వేల కోట్ల వ్యాపారం!

Holi celebrations.. Rs. 60 thousand crore business!

Mar 9, 2025 - 18:41
 0
హోలీ వేడుకలు.. రూ. 60వేల కోట్ల వ్యాపారం!

నా తెలంగాణ, న్యూ ఢిల్లీ: దేశంలో హోలీ పర్వదినం వ్యాపారం రూ. 60వేల కోట్లుగా ఉంటుందని అంచనా వేశారు. అదే సమయంలో కేంద్ర ప్రభుత్వం పలు మార్గనిర్దేశకాలను జారీ చేసింది. చైనీస్​ రంగుతో దూరం ఉండాలని విజ్ఞప్తి చేసింది. ఇప్పటికే దేశంలోని పలు ప్రాంతాల్లో, దేవాలయాల్లో హోలి వేడుకల ప్రారంభాన్ని ప్రకటించాయి. మార్చి 14న హోలీ పండుగ దేశవ్యాప్తంగా ఘనంగా నిర్వహించుకోనున్నారు. హోలీ రంగులు, స్వీట్లు, వాటర్​ గన్లు, పూలు, పండ్లు, దేవాలయాల్లో ప్రత్యేక ఏర్పాట్లు, సామూహికంగా వేడుకల నిర్వహణ తదితరాల్లో భారీ ఖర్చుతో మార్కెట్లు కలకలలాడనున్నాయి. దీంతో వ్యాపార వర్గాలకు లాభం చేకూరనుంది. చైనీస్​ రంగులను వ్యాపార వర్గాలు ప్రభుత్వం విజ్ఞప్తి మేరకు బహిష్కరించనున్నారని కాన్ఫెడరేషన్​ ఆఫ్​ ఆల్​ ఇండియా ట్రేడర్స్​ (సీఎఐటీ) జాతీయ ప్రధాన కార్యదర్శి, బీజేపీ ఎంపీ ప్రవీణ్​ ఖండేల్వాల్​ తెలిపారు. ప్రజలు దేశీయంగా తయారైన వస్తువుల కొనుగోలుకే ఎక్కువ మొగ్గు చూపుతున్నారని స్పష్టం చేశారు. గతేడాది హోలీ వేడుకల్లో దేశవ్యాప్తంగా రూ. 50వేల కోట్ల వ్యాపారం జరిగినట్లు చెప్పారు. ఈసారి వ్యాపారం 20 శాతం ఎక్కుగా ఉండే అవకాశం ఉందని అంచనా వేస్తున్నారు.