యోగాతో గుండెజబ్బులు దూరం
ప్రొఫెసర్ డాక్టర్ గౌతమ్ శర్మ

నా తెలంగాణ, న్యూ ఢిల్లీ: యోగాతో రక్తపోటు తగ్గుతుందని, పలు రకాల రుగ్మతలను దూరం చేసుకోవచ్చని సీఐఎంఆర్ (సెంట్ ఫర్ ఇంటిగ్రేటెడ్ మెడిసిన్ అండ్ రీసెర్చ్) ప్రొఫెసర్ డాక్టర్ గౌతమ్ శర్మ స్పష్టం చేశారు. న్యూ ఢిల్లీలో ‘ఇంటిగ్రేటెడ్ మెడిసిన్ పురోగతి’ అనే అంశంపై జరిగిన సమావేశంలో ఆదివారం మీడియాతో మాట్లాడారు. పరిశోధనలో నాడీ, గుండె సంబంధిత వ్యాధులను యోగా నివారిస్తుందని చెప్పారు. మైగ్రేన్ ను కూడా తగ్గిస్తుందన్నారు. తమ పరిశోధనలో యోగా చేస్తున్న పలువురిని, చేయని వారి ఆరోగ్య పరిస్థితులను పరిశీలించి ఈ విషయాలను గుర్తించామన్నారు. పరిశోధనలోని అంశాలు ఆసక్తిని రేకెత్తించాయన్నారు. ఆయా పరిశోధనల్లోని అంశాలు శాస్త్రీయంగా కూడా రూఢీ చేసుకున్నట్లు వివరించారు. యోగా చేయడం అంటే యాడ్ ఆన్ థెరపీ అని రోగుల జీవన నాణ్యతను పెంపొందిస్తుందని అన్నారు. ప్రొఫెసర్ గౌతమ్ శర్మను పరిశోధనల ఫలితాలను వివరించేందుకు యూరోపియన్ సొసైటీ ఆఫ్ కార్డియాలజీ, అమెరికన్ హార్ట్ రిథమ్ సొసైటీలు ఆహ్వానించాయి. ఈ రెండు వైద్య విభాగాలు యోగాపై మరిన్ని పరిశోధనలకు ఆసక్తిని వ్యక్తం చేయడం గమనార్హం.