యూసీసీ అమలుకు గుజరాత్ సిద్ధం
Gujarat is ready for the implementation of UCC

ఐదుగురు అధ్యక్షతన కమిటీ నియామకం
ప్రకటించిన సీఎం భూపేంద్ర పటేల్
గాంధీనగర్: గుజరాత్ లో యూసీసీ అమలుకు పూర్తి ప్రణాళిక సిద్ధమైంది. ఆ రాష్ర్ట సీఎం భూపేంద్ర పటేల్ మంగళవారం విలేఖరుల సమావేశంలో పలు వివరాలు వెల్లడించారు. యూసీసీకి సంబంధించి ఒక కమిటీని ఏర్పాటు చేస్తున్నట్లు ప్రకటించారు. ఈ కమిటీలో సుప్రీంకోర్టు రిటైర్డ్ న్యాయమూర్తులు రంజనా దేశాయ్, సిఎల్ మీనా, ఆర్సీ కోడేకర్, దక్షేష్ ఠాక్రే, గీత ప్రాష్ లకు చోటు కల్పించారు. రాష్ర్ట పౌరులకు సమాన హక్కులు కల్పించేందుకు ప్రధాని మోదీ నేతృత్వంలోని ఉమ్మడి పౌర నియమావళికి కట్టుబడి ఉన్నామని, యూసీసీ అమలు చేయాలని నిర్ణయించామన్నారు. ఇచ్చిన హామీలన్నింటినీ ఒక్కొక్కటిగా నెరవేర్చామన్నారు. మోదీ సంకల్పాన్ని సాకారం చేసుకునే దిశగా గుజరాత్ ముందుకు సాగుతుందన్నారు. ఈ కమిటీ 45 రోజుల్లో రాష్ర్ట ప్రభుత్వానికి నివేదిక సమర్పిస్తుందని స్పష్టం చేశారు. కమిటీ నివేదిక ఆధారంగా యూసీసీపై నిర్ణయం తీసుకుంటామన్నారు.