గ్లోబల్​ సెమీ కండక్టర్​ 2024లో 6.9 శాతం వృద్ధి

Global semiconductor to grow by 6.9 percent in 2024

Feb 3, 2025 - 18:28
 0
గ్లోబల్​ సెమీ కండక్టర్​ 2024లో 6.9 శాతం వృద్ధి

నా తెలంగాణ, న్యూ ఢిల్లీ: గ్లోబల్​ సెమీ కండక్టర్​ పరిశ్రమ 2024లో 6.9 శాతం బలమైన వృద్ధిని సాధించింది. ఆదాయం 626 బిలియన్​ డాలర్లకు చేరుకుంది. ఇది పరిశ్రమ ఆదాయంలో 74.8 శాతం పెరుగుదలను సూచిస్తుంది. గతేడాది 2023తో పోలిస్తే ఆదాయం 18.1 శాతం పెరిగిందని ఓ నివేదిక పేర్కొంది. 2025లో ఆదాయం 705 బిలియన్లకు చేరుకుంటుందని అంచనా వేస్తున్నట్లు నివేదిక స్పష్టం చేసింది. టాప్​ 25 సెమీకండక్టర్ సంస్థలలో 11 రెండంకెల ఆదాయాన్ని పెంచగా, ఎనిమిది మాత్రమే క్షీణించాయని నివేదిక స్పష్టం చేసింది. దేశీయ సెమీ కండక్టర్​ రంగం ప్రపంచవ్యాప్తంగా చూసుకుంటే ఒక శాతం వృద్ధిని సాధించింది. ఈ రంగంలో వృద్ధికి ఏఐ కీలకంగా నిలిచింది.