రిటైర్డ్ అధికారి కుటుంబంపై ఉగ్రకాల్పులు
అధికారి మృతి, భార్య, కూతురికి బుల్లెట్ గాయాలు

శ్రీనగర్: కశ్మీర్ లో రిటైర్డ్ లాన్స్ నాయక్ మంజూర్ అహ్మద్ కుటుంబంపై ఉగ్రవాదులు విరుచుకుపడ్డారు. సోమవారం కుల్గామ్ లోని బెహిబాగ్ ఇంటి నుంచి కారులో బయటకు వెళుతున్న మంజూర్, భార్య, కూతురిపై అతిదగ్గరగా ఉగ్రవాదులు కాల్పులకు పాల్పడ్డారు. దీంతో మంజూర్ అక్కడికక్కడే మృతి చెందగా, భార్య, కూతురుకు బుల్లెట్ గాయాలయ్యాయి. విషయం తెలుసుకున్న భద్రతా దళాలు ఆ ప్రాంతాన్ని తమ స్వాధీనంలోకి తీసుకున్నాయి. సోదాలు కొనసాగిస్తున్నారు. గాయపడ్డ మంజూర్ అహ్మద్ భార్య, కూతురిని శ్రీనగర్ ఆసుపత్రికి తరలించి చికిత్సనందింప చేస్తున్నారు. ఆ ప్రాంతంలో హై అలర్ట్ ప్రకటించారు. రాకపోకలను నిషేధించారు.