మాజీ ఎన్నికల కమిషనర్ నవీన్ చావ్లా కన్నుమూత
Former Election Commissioner Naveen Chawla passed away

నా తెలంగాణ, న్యూ ఢిల్లీ: మాజీ ఎన్నికల కమిషనర్ నవీన్ చావ్లా (79) శనివారం కన్నుమూశారు. మెదడు కు సంబంధించిన వ్యాధితో బాధపడుతున్న ఆయన శనివారం తుది శ్వాస విడిచినట్లు మాజీ సహోద్యోగి తెలిపారు. ఇటీవలే మాక్స్ ఆసుపత్రిలో బ్రెయిన్ సర్జరీ చేయించుకున్నారు. శనివారం ఉదయం గుండెపోటుతో మృతి చెందినట్లు తెలిపారు. శనివారం సాయంత్రం గ్రీన్ పార్క్ స్మశానవాటికలో అంత్యక్రియలు నిర్వహించనున్నట్లు తెలిపారు. నవీన్ చావ్లా 1969లో ఇండియన్ అడ్మినిస్ర్టేటివ్ సర్వీస్ లో చేరారు. ఢిల్లీ, గోవా, పుదుచ్ఛేరి, లక్షద్వీప్ లో పలు శాఖల్లో విధులు నిర్వహించారు. కార్మిక, హోం, సమాచార, ప్రసార మంత్రిత్వ శాఖలో కూడా పనిచేశారు.