భిన్నత్వంలో ఏకత్వమే హోళీ

పండుగ రాష్ట్రపతి, ప్రధాని, కేంద్రమంత్రి శుభాకాంక్షలు

Mar 13, 2025 - 18:36
 0
భిన్నత్వంలో ఏకత్వమే హోళీ

నా తెలంగాణ, న్యూ ఢిల్లీ: భిన్నత్వంలో ఏకత్వం అనే విలువలను పెంపొందించే, ప్రతిబింబించే పండుగ హోళీ అని రాష్ట్రపతి ద్రౌపదీ ముర్మూ అన్నారు. శుక్రవారం హోళీ పర్వదినం సందర్భంగా గురువారం ఓ ప్రకటన మాధ్యమంగా దేశ ప్రజలకు పండుగ శుభాకాంక్షలు తెలిపారు. రంగుల పండుగ ఐక్యత, సోదరభావ స్ఫూర్తిని పెంపొదిస్తుందని పేర్కొన్నారు. విదేశాల్లోనూ ఈ పర్వదినం సంతోషం నిర్వహించుకుంటున్న వారందరికీ శుభాకాంక్షలు తెలిపారు.

ప్రధాని మోదీ..
దేశ ప్రజలు ఉల్లాసం, ఉత్సాహంతో నిర్వహించుకునే హోళీ పండుగ శుభాకాంక్షలను ప్రధాని మోదీ తెలిపారు. ఈ పండుగ ప్రతీ ఒక్కరి జీవితంలోని నూతన రంగులను, వెలుగులను విరజిమ్మాలని కోరుకున్నారు. ఈ పండుగ దేశవాసులను ఐక్యతదిశగా తీసుకువెళుతుందన్నారు.

కేంద్రమంత్రి జి.కిషన్​ రెడ్డి..
రంగులకేళీ హోళీని ప్రతీ ఒక్కరూ సంతోషంగా నిర్వహించుకోవాలని తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు, కేంద్ర బొగ్గు, గనుల శాఖ మంత్రి జి.కిషన్​ రెడ్డి అన్నారు. శుక్రవారం హోళీ పండుగ సందర్భంగా దేశ ప్రజలకు శుభాకాంక్షలు తెలిపారు. ప్రతీ ఒక్కరి జీవితం అన్ని రంగుల సమ్మేళనంగా, అత్యద్భుతంగా కొనసాగాలని జి.కిషన్​ రెడ్డి ఆకాంక్షించారు.