ఆటో అమ్మకాల్లో 6.6 శాతం వృద్ధి
ఎఫ్ఎడిఎ నివేదికలో వెల్లడి

నా తెలంగాణ, న్యూ ఢిల్లీ: జనవరి–2025లో ఆటో అమ్మకాల్లో 6.6 శాతం వృద్ధి నమోదైందని ఎఫ్ ఎడీఎ ఆటోమొబైల్ డీలర్స్ అసోసియేషన్స్ సమాఖ్య (FADA–ఫెడరేషన్ ఆఫ్ ఆటోమొబైల్ డీలర్స్ అసోసియేషన్ ఇండియా) గురువారం వెల్లడించింది. 2025లో ఆటోమొబైల్ రంగం బలమైన వృద్ధితో మొదలైంది. ఫలితాలు సానుకూలంగా ఉన్నప్పటికీ ఫిబ్రవరిలో మరింత వృద్ధిని ఆటో డీలర్లు ఆశిస్తున్నారు. అదే సమయంలో మరికొంతమంది డీలర్లు ఫిబ్రవరి అమ్మకాల్లో క్షీణత కూడా నమోదయ్యే అవకాశం ఉందని అంచనా వేస్తున్నారు. కాగా ఆటోమొబైల్ అమ్మకాలు పెరిగేందుకు కేంద్ర బడ్జెట్ లో ఎలాంటి ప్రకటన ఉంటుందోననే ఆందోళనలు కూడా కారణమై ఉండొచ్చని ఎఫ్ఎడీఎ పేర్కొంది. అదే సమయంలో కేంద్ర బడ్జెట్ లో మధ్యతరగతి వర్గాలకు బొనాంజా లాంటి నిర్ణయం వల్ల ఫిబ్రవరిలోనూ ఆటో మొబైల్ అమ్మకాల్లో వృద్ధి చోటు చేసుకునే అవకాశం ఉందని అంచనా వేసింది. ద్విచక్ర వాహనాలు 4.15 శాతం, త్రిచక్ర వాహనాలు గతేడాది కాలంలో 15.53 శాతం, వాణిజ్య వాహనాలు 8.22 శాతం పెరిగాయి. నగర మార్కెట్లలో 18.57 శాతం అమ్మకాలు పెరిగినట్లు ఎఫ్ఎడీఎ తెలిపింది.