కుటుంబ రాజకీయాలు కాంగ్రెస్కు అలవాటే
ముచ్చటగా మూడోసారి ప్రధాని మోదీ గెలుపు ఖాయం మాజీ సీఎం బొమ్మై
బెంగళూరు: వంశపారంపర్య రాజకీయాలే కాంగ్రెస్కు అలవాటని కుటుంబీకులు, బంధువులకే ఈసారి కూడా టిక్కెట్లు కేటాయించుకున్నారని బీజేపీ అగ్రనాయకుడు, మాజీ సీఎం బసవరాజ్ బొమ్మై అన్నారు. శనివారం బెంగళూరులో నిర్వహించిన ఓ కార్యక్రమంలో పాల్గొని ప్రసంగించారు. దేశంలో ఎక్కడ చూసిన బీజేపీ, ప్రధాని మోదీ మేనియా నడుస్తోందన్నారు. ముచ్చటగా మూడోసారి ప్రధాని పీఠాన్ని మోదీ అధిష్ఠించనున్నారని తెలిపారు. అనంతరం కాంగ్రెస్లో విభేదాలు బయటపడనున్నాయన్నారు. ఈసారి కుటుంబీకులకు, బంధువులకు మాత్రమే టిక్కెట్లు కేటాయించడం వెనుక వేరే కారణం ఉందని బొమ్మై అన్నారు. కాంగ్రెస్ పార్టీ తరఫున పదిమంది మంత్రులు పోటీ చేస్తున్నా గెలుపుపై వారికి ఏ మాత్రం నమ్మకం లేదని స్పష్టం చేశారు. దేశ ఆర్థిక వ్యవస్థను ఉన్నతస్థాయికి చేర్చి ప్రపంచంలోనే భారత కీర్తి గౌరవాలను చాటిన వ్యక్తి ప్రధాని మోదీ అన్నారు. తాను ఎప్పుడు నామినేషన్ దాఖలు చేస్తాననేది 31న చెబుతానని అన్నారు.