స్పేస్​ ఎక్స్​ ప్రయత్నాన్ని జో బైడెన్​ అంగీకరించలే

వ్యోమగాముల రిటర్న్​ పై మస్క్​ ఆరోపణలు

Mar 19, 2025 - 15:54
 0
స్పేస్​ ఎక్స్​ ప్రయత్నాన్ని జో బైడెన్​ అంగీకరించలే

వాషింగ్టన్​: సునీతా విలియమ్స్​, బుచ్​ విల్మోర్​ లను అంతరిక్షం నుంచి సురక్షితంగా భూమికి తీసుకువచ్చే ప్రతిపాదనకు జో బైడెన్​ ప్రభుత్వం అంగీకరించలేదని ఎలన్​ మస్క్​ అన్నారు. ప్రస్తుత అధ్యక్షుడు ట్రంప్​ సహకారంతో ఇది సాధ్యపడిందన్నారు. వ్యోమగాములు సురక్షితంగా భూమికి రావడాన్ని ఆయన స్వాగతిస్తూ సంతోషం వ్యక్తం చేశారు. అదే సమయంలో ఎలన్​ మస్క్​ స్పేస్​ ఎక్స్​ కు నాసా కృతజ్ఞతలు తెలిపింది. వ్యోమగాములను తీసుకురావడంలో మస్క్​ స్పేస్​ ఎక్స్​ సహకారం మరువలేనిదన్నారు. ఇందుకు ఆయనకు కృతజ్ఞతలు తెలిపారు. 

జో బైడెన్​ ప్రభుత్వం ఉన్నప్పుడే స్పేస్​ ఎక్స్​ ద్వారా వ్యోమగాములను సురక్షితంగా తీసుకువస్తామని ప్రతిపాదించి ఈ విషయంపై ప్రభుత్వం నిర్ణయం తీసుకోవాలని కోరామన్నారు. కానీ ఆయన రాజకీయ కారణాలతో తమ మిషన్​ ను పెండింగ్​ లో పెట్టారన్నారు. అందువల్లే ఆలస్యం ఏర్పడిందన్నారు. లేకుంటే ఈ పాటికే వ్యోమగాములను సురక్షితంగా భూమిపైకి తీసుకువచ్చేవారమని మస్క్​ బైడెన్​ నిర్ణయాన్ని తప్పుబట్టారు. అదే సమయంలో డోనాల్డ్​ ట్రంప్​ సహకారం, నిర్ణయం వల్లే నేడు యావత్​ ప్రపంచం హర్షం వ్యక్తం చేస్తుందని, ప్రశంసలు కురిపిస్తుందని ధన్యవాదాలు తెలిపారు.