మార్చి 6న ఈయూ శిఖరాగ్ర సదస్సు
మద్ధతు అందించాలని జెలెన్స్కీ విజ్ఞప్తి

కీవ్: యూరోపియన్ యూనియన్ దేశాలు తమకు మద్ధతు అందించాలని ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్స్క్ మరో మారు విజ్ఞప్తి చేశారు. ఈ అంశంపై మార్చి 6న జరిగే ప్రత్యేక శిఖరాగ్ర సమావేశం నిర్వహించనున్నారు. మద్ధతు ఇవ్వాలని కోరారని, శిక్షరాగ్ర సమావేశానికి ఆహ్వానం పంపినట్లు ఈయూ కౌన్సిల్ అధ్యక్షుడు ఆంటోనియో కోస్టా గురువారం తెలిపారు. యూరప్ దేశాల భద్రతకు బాధ్యత వహించేందుకు తాము సిద్ధంగా ఉన్నట్లు తెలిపారు. ఉక్రెయిన్ లో శాంతి స్థాపనకు ఈయూ అన్ని దేశాలు సిద్ధంగా ఉండాలని పిలుపునిచ్చినట్లు పేర్కొన్నారు.
ఉక్రెయిన్ నాటోలో చేరడం, రష్యాతో యుద్ధం, ఆయుధాల అందజేత వంటి విషయాలపై అమెరికా అధ్యక్షుడు ట్రంప్ చేతులెత్తేశాడు. అంతేగాక శాంతిని స్థాపించాలనుకునే దేశాలు తమ దేశ నిర్ణయాన్ని గౌరవించాల్సిందేనని ఈయూ దేశాలకు హెచ్చరికలు కూడా జారీ చేశారు. దీంతో రష్యా అధ్యక్షుడు పుతిన్ కు అమెరికా సహకారం అందిస్తుందనేది స్పష్టం అయిపోయింది. కాగా అదే సమయంలో జెలెన్స్క్ ని అధ్యక్ష పదవిని నుంచి తప్పించే యోచన కూడా ఉన్నట్లు రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు. దీంతో రష్యా–ఉక్రెయిన్ లో శాంతి నెలకొనే ఆస్కారం ఉన్నట్లు పేర్కొంటున్నారు.