జీఎస్టీ ముందస్తు బెయిల్​ దరఖాస్తు చేసుకోవచ్చు: సుప్రీం

GST can apply for anticipatory bail: Supreme

Feb 27, 2025 - 15:16
 0
జీఎస్టీ ముందస్తు బెయిల్​ దరఖాస్తు చేసుకోవచ్చు: సుప్రీం

నా తెలంగాణ, న్యూ ఢిల్లీ: జీఎస్టీ కేసులలో ముందస్తు బెయిల్​ కోసం దరఖాస్తు దాఖలు చేసుకోవచ్చని సుప్రీంకోర్టు పేర్కొంది.  2018లో రాధికా అగర్వాల్​ దాఖలు చేసిన పిటిషన్​ పై గురువారం చీఫ్​ జస్టిస్​ సంజీవ్​ ఖన్నా, జస్టిస్​ ఎంఎం సుందరేష్​, బేలా ఎం త్రివేదిలతో కూడిన త్రిసభ్య ధర్మాసనం విచారణ చేపట్టింది. జీఎస్టీ, కస్టమ్స్​ చట్టాల్లో కూడా ముందస్తు బెయిల్​ వర్తిస్తుందని పేర్కొంది. ఎఫ్​ ఐఆర్​ నమోదు కాకముందే ఏ వ్యక్తి అయినా కోర్టులో ముందస్తు బెయిల్​ దరఖాస్తు చేసుకోవచ్చని న్యాయమూర్తులు స్పష్టం చేశారు. ఇండియన్​ సివిల్​ సెక్యూరిటీ కోడ్​ నూతన చట్టం సీఆర్పీసీ కింద కూడా వర్తిస్తుందని కోర్టు స్పష్టం చేసింది.