దేశవ్యాప్త ఎన్నికల్లో ఫలితాల్లో ఆలస్యం

రెండు పిటిషన్లపై ఏప్రిల్​ 16న సప్రీం విచారణే కారణం?

Apr 11, 2024 - 19:02
 0
దేశవ్యాప్త ఎన్నికల్లో ఫలితాల్లో ఆలస్యం

న్యూఢిల్లీ: ఎన్నికల ఫలితాల్లో ఐదారు రోజుల ఆలస్యం ఏర్పడే అవకాశం ఉంది. సరిగ్గా ఫలితాల విడుదలకు ముందు సుప్రీంలో దాఖలైన ఈవీఎం–వీవీప్యాట్​ లపై విచారణ చేపట్టనుంది. దీంతో ఫలితాల విడుదలపై గందరగోళం నెలకొంది. సుప్రీంకోర్టులో ఇందుకు సంబంధించి రెండు పిటిషన్​ లు దాఖలయ్యయి. ఏడీఆర్​ ఒక పిటిషన్​ దాఖలు చేయగా, ఇదే డిమాండ్​ తో రెండో పిటిషన్​ ను అరుణ్ కుమార్ అగర్వాల్ అనే వ్యక్తి కూడా దాఖలు చేశాడు. దీనిపై జస్టిస్ సంజీవ్ ఖన్నా, జస్టిస్ దీపాంకర్ దత్తాలతో కూడిన సుప్రీంకోర్టు ధర్మాసనం విచారణ జరుపుతోంది. ఏప్రిల్​ 16వ తేదీకి ఈ కేసు విచారణను వాయిదా వేసింది. ఈవీఎం, వీవీ ప్యాట్​ స్లిప్పుల్లో నమోదైన ఓట్లను సరిపోల్చడంపై సుప్రీంలో పిటిషన్​ దాఖలైన విషయం తెలిసిందే. 

2019కి ముందే 21 ప్రతిపక్ష పార్టీలు సుప్రీంలో ప్రతి లోక్‌సభ నియోజకవర్గంలోని యాభై శాతం ఈవీఎం ఓట్లను వీవీప్యాట్ స్లిప్‌లతో సరిపోల్చాలని ప్రతిపక్ష పార్టీలు డిమాండ్ చేశాయి.
భారత్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్ (బీఇఎల్​), ఎలక్ట్రానిక్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా లిమిటెడ్ (ఈసీఐఎల్​) 2013లో వీవీప్యాట్​ అంటే ఓటర్ వెరిఫైయబుల్ పేపర్ ఆడిట్ ట్రైల్ మెషీన్‌లను రూపొందించాయి. ఈ రెండూ ఒకే ప్రభుత్వ సంస్థలు, ఇవి ఈవీఎంలను ఎలక్ట్రానిక్ ఓటింగ్ యంత్రాలను కూడా తయారు చేస్తాయి.

2013లో మొదటిసారిగా వీవీ ప్యాట్​ లను ఉపయోగించారు. 2014లో రెండోసారి కూడా ఈ యంత్రాన్ని అమర్చారు. 2017లో గోవా అసెంబ్లీలో కూడా వీటిని ఉపయోగించారు.