తగ్గేదేలే: జెలెన్స్కీ తగ్గకుంటే మీకే నష్టం: ట్రంప్​

It will decrease: If Zelensky does not decrease, you will lose: Trump

Mar 1, 2025 - 13:06
 0
తగ్గేదేలే: జెలెన్స్కీ తగ్గకుంటే మీకే నష్టం: ట్రంప్​

అమెరికాకు ఋణపడి ఉండాలి: వాన్స్​

వాషింగ్టన్​: అమెరికా, ఉక్రెయిన్​ అధ్యక్షులు ట్రంప్​, జెలెన్స్కీల మధ్య తీవ్ర వాగ్వివాదం జరిగింది. మీడియా ముందే ఇద్దరూ ఒకరిపై ఒకరు ఆగ్రహం వ్యక్తం చేసుకునే వరకూ పరిస్థితి వెళ్లింది. దీంతో మీడియా సమావేశాన్ని రద్దు చేశారు. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన వార్తలు హాట్​ టాపిక్​ గా మారాయి. మొత్తానికి అమెరికా ఒత్తిళ్లకు జెలెన్స్కీ ఎంతకు వెనక్కు తగ్గకపోవడంతో యుద్ధానికి మరింత ఆజ్యం పోసినట్లయిందనే భావన నెలకొంది. 

ఖనిజ మైనింగ్​ ఒప్పందంలో భాగంగా జెలెన్స్కీ శుక్రవారం రాత్రి అమెరికాకు వచ్చారు. ఆయనకు వైట్​ హౌస్​ లో ట్రంప్​ స్వాగతం పలికారు. ఈ సందర్భంగా జెలెన్స్కీ, ట్రంప్​ తోపాటు, అమెరికా ఉపాధ్యాక్షుడు వాన్​ మధ్య ఓవల్​ హౌస్​ లో వాడీ వేడీ చర్చలు జరిగాయి. చర్చల్లో ఒకరిపై మరొకరు వెళ్లు చూపుకుంటూ వార్నింగ్​ ఇచ్చేలా మాట్లాడుకోవడం ప్రపంచదేశాలను కలవరపాటుకు గురి చేసింది. 

ముగ్గురి మధ్య సంభాషణ..
ట్రంప్​..
– తాను రష్యా, ఉక్రెయిన్​ యుద్ధాన్ని ఆపేందుకు ప్రయత్నిస్తున్నానని అలా జరిగితే బాగుంటుందని ట్రంప్​ అన్నారు. యుద్ధం వీలైనంత త్వరగా ముగియాలని అమెరికా దళాలు అవసరం ఉండదని ఆశిస్తున్నట్లు తెలిపారు. అమెరికా–ఉక్రెయిన్​ లకు ఖనిజాల ఒప్పందం అవసరమని ఈ నిర్ణయాన్ని అభినందిస్తున్నట్లు పేర్కొన్నారు. రష్​యా–ఉక్రెయిన్​ రెండింటితోనూ సమన్వయం చేసుకుంటూ ముందుకు వెళతామన్నారు. తాను ఎవ్వరి వెంట లేనని అమెరికా జాతీయ ప్రయోజనాల కోసం పనిచేస్తున్నానని చెప్పారు. మేలు కోరుతున్న తమతో ఆగ్రహంతో మాట్లాడటం సరికాదన్నారు. జో బైడెన్​ ఆర్థిక సహాయం చేయడం వల్లే ఉక్రెయిన్​ ఇంకా యుద్ధంలో నిలబడిందని, లేకుంటే రెండు వారాల్లోనే యుద్ధం ముగిసేదన్నారు. ఇరువురి వాదనలు వింటున్న ట్రంప్​ కు చివరకు చిర్రెత్తుకొచ్చింది. తాము ఏం చేయాలో మీరు చెప్పొద్దని, ఆ స్థితిలో మీరు లేరని ట్రంప్​ మండిపడ్డారు. ప్రజల జీవితాలతో ఆడుకుంటున్నారని ఆగ్రహంగా వ్యక్తం చేస్తూ కూర్చీ నుంచి కాస్త దూరం జరిగారు. జెలెన్స్కీ తీసుకున్న నిర్ణయాలు మూడో ప్రపంచ యుద్ధం వైపు దారితీసే అవకాశం ఉన్నాయని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ సభా వేదికగానే కాల్పుల విరమణ జరిగితే అదే జరగాలని కోరుకుంటున్నట్లు చెప్పారు. యుద్ధం వల్ల ఎంతోమంది ప్రాణాలను ఫణంగా పెట్టడం సరికాదన్నారు. 

జెలెన్స్కీ..
– జెలెన్స్కీ మాట్లాడుతూ శాంతి ఒప్పందంలో ఎలాంటి ఉల్లంఘనలు ఉండకూడదని అన్నారు. రష్యాతో దౌత్యం చేయమనడం సరైంది కాదన్నారు. 2014లోనూ అనేకసార్లు చర్చలు జరిగాయన్నారు. 2019లోనూ ఒప్పందంపై సంతకాలు చేశామన్నారు. కాల్పుల విరమణ హామీ ఒప్పందాన్ని తుంగలో తొక్కారని, యుద్ధ ఖైదీల విడుదలను కూడా పుతిన్​ ఉల్లంఘించారని, 2022 నుంచి ఉక్రెయిన్​ పై దాడిని ప్రారంభించారని వాపోయారు. వాన్స్​ తో జెలెన్స్కీ ఆగ్రహంతో మాట్లాడారు. ఒక్కసారి ఉక్రెయిన్​ యుద్ధ స్థలాలకు వెళ్లి వాన్స్​ చూడాలన్నారు. అక్కడి పరిస్థితులు అర్థం అవుతాయన్నారు. ఈ యుద్ధం భవిష్యత్తులో అమెరికానూ ప్రభావితం చేస్తుందని హెచ్చరించారు. రష్​యా (పుతిన్​)తో చర్చలు జరపబోమని కుండబద్ధలు కొట్టారు. ఖనిజ ఒప్పందంపై సంతకం చేయకుండానే వెనుదిరిగారు. 

ఉపాధ్యక్షుడు వాన్స్​..
– జెలెన్స్కీ సమాధానం ఇవ్వబోతుండగా ఉపాధ్యక్షుడు వాన్స్​ మాట్లాడటం ప్రారంభించారు. ఉక్రెయిన్​ లో శాంతి, శ్రేయస్సుకు ఒక్కటే మార్గమన్నారు. దౌత్యం ద్వారానే అది సాధ్యమన్నారు. ట్రంప్​ చేస్తున్న ప్రయత్నాలకు కృతజ్ఞతలు చెప్పాల్సిన అవసరం ఉందన్నారు. ఉక్రెయిన్​ లో జరుగుతున్న విధ్వంసం ఆపే దౌత్యం గురించి తాను మాట్లాతున్నానని చెప్పారు. ట్రంప్​ పై వెలేత్తి చూపుతూ మాట్లాడడం, మీడియా ముందు సరైంది కాదన్నారు. ఇది అగౌరవంగా తాము భావిస్తున్నామని ఆగ్రహం వ్యక్తం చేశారు. మీరు సరిహద్దులో చాలా బలహీనంగా ఉన్నారు. విధ్వంసాలను కళ్లారా చూశాము కాబట్టే ఆపాలని ప్రయత్నిస్తున్నామని చెప్పారు. విధ్వంసాలను ఆపాలని అమెరికా భావిస్తుంటే తమతోనే అగౌరవంగా ప్రదర్శించడం సరైందేనా? అని జెలెన్స్నీని నిలదీశారు. తమ ప్రత్యర్థి తరఫున ప్రచారం చేపట్టినా తాము మీ దేశంలో శాంతి నెలకొల్పాలనే భావిస్తున్నందుకు కృతజ్ఞత ఉండాలన్నారు. 

మీడియాతో ట్రంప్​..
వైట్​ హౌస్​ లో జెలెన్స్కీతో ముఖ్యమైన సమావేశం జరిగింది. భావోద్వేగాల మధ్య సమావేశం జరిగినప్పటికీ మంచి నిర్ణయం తీసుకుంటామని భావిస్తున్నాను. అమెరికా శాంతిని పరిరక్షించేందుకు ప్రయత్నిస్తుంటే జెలెన్స్కీ అందుకు సిద్ధంగా లేరని మీడియా సాక్షిగా స్పష్టం అవుతుందన్నారు. ఇరుదేశాల మధ్య యుద్ధాన్ని ఆపడంతో తమ దేశానికేదే భారీ ప్రయోజనం చేకూరుతున్నట్లు మాట్లాడారని ఆగ్రహం వ్యక్తం చేశారు. అమెరికాకు ఉక్రెయిన్​ ఎలాంటి ప్రయోజనం అక్కరలేదని, శాంతి మాత్రమే కావాలన్నారు. వైట్​ హౌస్​ లోనే అమెరికాను అవమానపరిచేలా జెలెన్స్కీ మాట్లాడారని మండిపడ్డారు. ఉక్రెయిన్​ లో శాంతి చేకూరాలంటే చర్చలకు రావచ్చని ట్రంప్​ స్వాగతించారు. 

మీడియాతో జెలెన్స్కీ..
జెలెన్స్కీ మాట్లాడుతూ- అమెరికా సందర్శన, మద్ధతు, సహాయానికి ధన్యవాదాలు. తమకు న్యాయపరమైన శాశ్వత శాంతి అవసరం. ఖచ్చితంగా ఆ దిశగా తాము చర్చలకు కృషి చేస్తూనే ఉంటాం.