సీఎం ప్రమాణ స్వీకారం ఉదయం 11 గంటలకే!
CM swearing in at 11 am!

ఇంకా ప్రకటించని ఢిల్లీ సీఎం పేరు
బుధవారం శాసనసభా పక్షంతో అధినేతల భేటీ
అనూహ్యాంగా తెరపైకి రేఖా గుప్తా పేరు
నా తెలంగాణ, న్యూ ఢిల్లీ: ఢిల్లీ సీఎం ప్రమాణ స్వీకారం సమయం మారింది. ఫిబ్రవరి 20న సాయంత్రం 4.30 గంటలకు రాంలీలా మైదానంలో నూతన ముఖ్యమంత్రి ప్రమాణ స్వీకారం సమయంలో మార్పు చోటు చేసుకుందని పార్టీ వర్గాలు మంగళవారం మీడియాకు వివరించాయి. ఉదయం 11 గంటలకు ప్రమాణ స్వీకారం ఉంటుందని తెలిపాయి. అయితే సీఎం ఎవరన్నది మాత్రం ఇంకా నిర్ణయించలేదని 19న మధ్యాహ్నం 3 గంటలకు పార్టీ శాసనసభా పక్ష సమావేశం జరగనుంది. ఆ తరువాత సీఎం పేరును ప్రకటించే అవకాశం ఉందని తెలుస్తోంది. మరోవైపు ఢిల్లీ అభ్యర్థి పేరును దాదాపుగా ఖరారు చేసినట్లుగా భావిస్తున్నారు. సీఎం రేసులో ప్రవేశ్ వర్మను భావించగా అనుహ్యాంగా రేఖా గుప్తా పేరు తెరపైకి వస్తుంది. రేఖా గుప్తా షాలిమార్ బాగ్ నుంచి ఎమ్మెల్యేగా విజయం సాధించారు. ఇక్కడి సీఎం పోటీ బహుముఖంగా నిలవడంతో మహిళా సీఎం వైపు పార్టీ అధిష్టానం మొగ్గు చూపినట్లు తెలుస్తుంది. అయితే సీఎం ఎవరన్నది మాత్రం అధికారికంగా బీజేపీ ఇంకా ప్రకటించలేదు. కాగా 20న జరిగే సీఎం ప్రమాణ స్వీకారంలో 20 బీజేపీ, ఎన్డీఏ పాలిత రాష్ట్రాల ముఖ్యమంత్రులు, డిప్యూటీ సిఎంలు ఉంటారు. వీరితో పాటు, పారిశ్రామికవేత్తలు, సినీ తారలు, క్రికెట్ ఆటగాళ్ళు, సాదువులు, దౌత్యవేత్తలు కూడా వస్తారు. మొత్తం 12 నుంచి 16 వేల మంది సభకు విచ్చేసేలా ఇప్పటికే ఏర్పాట్లు పూర్తయ్యాయి. ఈ కార్యక్రమ ఏర్పాట్లను బీజేపీ ప్రధాన కార్యదర్శులు వినోద్ తావ్డే, తరుణ్ చుగ్ లు పర్యవేక్షిస్తున్నారు.