చారిత్రక కోటల పరిరక్షణకు సీఎం ఉత్తర్వులు జారీ
CM issued orders for preservation of historical forts
ముంబాయి: మహారాష్ట్రలోని చారిత్రక కోటల పరిధిలోని ఆక్రమణలను తొలగించే చర్యలకు సీఎం దేవేంద్ర ఫడ్నవీస్ శ్రీకారం చుట్టారు. ఈ మేరకు మంగళవారం రాష్ర్టంలోని అన్ని జిల్లాల తహశీల్దార్లకు ఆక్రమణలపై చర్యలు తీసుకోవాలని ఉత్తర్వులు జారీ చేశారు. ఈ ఆక్రమణలను చేపట్టాలని ప్రజల నుంచి అనేక డిమాండ్లు వచ్చిన నేపథ్యంలో సీఎం ఈ చర్యలు తీసుకున్నారు. జనవరి 31లోగా కోటల వారీగా ఉన్న ఆక్రమణల జాబితాను సిద్ధం చేయాలని ఆదేశించారు. కొల్హాపూర్ లోని విశాల్ గఢ్ కోట ఆక్రమణ విషయంపై సీరియస్ అయిన సీఎం ఫడ్నవీస్ రాష్ట్రవ్యాప్తంగా చారిత్రక కోటల పరిరక్షణకు నడుం బిగించారు. ఆక్రమణలకు వ్యతిరేకంగా మేజిస్ర్టేట్ ల అధ్యక్షతన జిల్లా స్థాయి కమిటీలను ఏర్పాటు చేయనున్నారు. ఈ కమిటీలు మే 31 వరకు దశల వారీగా ఆక్రమణల తొలగింపును పర్యవేక్షిస్తాయి. భవిష్యత్ లో కోటలు ఆక్రమణకు గురికాకుండా ప్రభుత్వం విజిలెన్స్ కమిటీలను ఏర్పాటు చేయనుంది. మహారాష్ర్టలో 47 కోటలను కేంద్ర ప్రభుత్వం సంరక్షిస్తుంది. మరో 62 కోటలను రాష్ర్ట ప్రభుత్వం సంరక్షణ బాధ్యతలు తీసుకుంది. ఇవిగాక మరో 300 కోట్ల వరకు సంరక్షణ లేకుండా ఉన్నాయి. తొలగింపు కమిటీలో జిల్లా స్థాయి పోలీస్ కమిషనర్, మున్సిపల్ కార్పొరేషన్ చీఫ్, ఫారెస్ట్ అధికారి, పురావస్తు శాఖ ప్రతినిధులు ఉండనున్నారు. ఆక్రమణదారులపై చర్యలు తీసుకోనున్నారు.