చత్తీస్ గఢ్ లో బర్డ్ ఫ్లూ కలకలం.. 15వేల కోళ్లు మృతి
Bird flu outbreak in Chattisgarh.. 15 thousand chickens died

రాయ్ పూర్: చత్తీస్ గఢ్ లోని రాయ్ గఢ్ లో బర్డ్ ఫ్లూ కలకలం సృష్టిస్తోంది. ప్రభుత్వం నిర్వహిస్తున్న కోళ్ల ఫారంలో 15వేలు పైగా కోళ్లకు బర్డ్ ఫ్లూ వైరస్ సోకి మృతి చెందాయి. కోళ్లతోపాటు 26,300 గుడ్లు, 712 క్వింటాళ్ల దాణాను పాతిపెట్టారు. దీంతో స్థానికంగా ఉన్న ప్రజలు భయబ్రాంతులకు గురవుతున్నారు. కాగా చనిపోయిన కోళ్లకు భోపాల్ నేషనల్ ఇన్ స్టిట్యూట్ ఆఫ్ హై సెక్యూరిటీ యానిమల్ డిసీజెస్ కు చెందిన ల్యాబక్ కు పంపి పరీక్షలు నిర్వహించారు. ఈ పరీక్షల్లో హెచ్5ఎన్1 సోకినట్లు నిర్దారణ అయ్యింది. బర్డ్ ఫ్లూపై రాయ్ గఢ్ కలెక్టర్ కార్తీకేయ ఆదివారం మీడియాతో మాట్లాడారు. బర్డ్ ఫ్లో సోకినట్లు నిర్ధారించామని విస్తరించకుండా ఉండేందుకు చర్యలు తీసుకున్నామన్నారు. పౌల్ట్రీ ఫారం ప్రాంగణంలో క్రిమి సంహారక చర్యలు చేపట్టినట్లు వివరించారు.