అమెరికా దిగుమతులపై 25 శాతం సుంకాలు!

కెనడా ప్రధాని జస్టిన్​ ట్రూడో

Feb 2, 2025 - 13:55
 0
అమెరికా దిగుమతులపై 25 శాతం సుంకాలు!

సమస్యల పరిష్కారానికి పొరుగుదేశాలతో చర్చిస్తాం: మెక్సికో అధ్యక్షురాలు షీన్​ బామ్​..

ఒట్టావా: యూఎస్​ అధ్యక్షుడు అమెరికా ట్రంప్​ ప్రకటనపై కెనడా గుర్రుగా ఉంది. అమెరికాకు చెందిన దిగుమతులపై 25 శాతం సుంకాలు విధించనున్నట్లు ఆ దేశ ప్రధాని ట్రోడో చెప్పారు. 155 బిలియన్​ డాలర్ల విలువైన వస్తువులపై ఈ సుంకం విధిస్తామని ప్రకటించారు. మరోవైపు, మెక్సికన్​ అధ్యక్షురాలు క్లాడియా షీన్​ బామ్​ మాట్లాడుతూ.. ఇరుదేశాలు ఒకరిపై మరొకరు సుంకాలు విధించుకోవడం వల్ల సమస్యలు పరిష్కారం కావన్నారు. పొరుగుదేశాలతో చర్చిస్తామన్నారు. మంగళవారం (ఫిబ్రవరి4) నుంచి 30 బిలియన్​ వస్తువులపై ఈ టారిఫ్​ ను అమలు చేస్తామన్నారు. రానున్న రోజుల్లో 125 బిలియన్​ వస్తువులపై మరిన్ని టారిఫ్​ లు విధిస్తామన్నారు. తాను సన్నిహితులు, పొరుగువారితో నేరుగా మాట్లాడాలని అనుకుంటున్నట్లు అమెరికా పేరు తీయకుండానే చెప్పారు. సుంకాలు విధించడం కెనడాకు హాని కలిగించే భారీ నుంచి తప్పిస్తామన్నారు. ఈ పరిణామాలు అమెరికాలోని ఉద్యోగులను కూడా ప్రమాదంలోకి నెడతాయన్నది గుర్తెరగాలన్నారు. ట్రంప్​ అమెరికాలో స్వర్ణయుగంగా తీర్చిదిద్దాలనుకుంటే కెనడాతో భాగస్వామ్యం అత్యంత కీలకమని గుర్తించాలని, అదే సమయంలో కెనడాపై సుంకాల ప్రకటనను వెంటనే ఉపసంహరించుకొని చర్చలు జరుపుదామన్నారు. 

మెక్సికో అధ్యక్షురాలు షీనాబామ్​ మాట్లాడుతూ.. మాదకద్రవ్యాలు, క్రిమినల్​ చర్యలలో మెక్సికోకు ఎటువంటి సంబంధం లేదన్నారు. పరస్పర విశ్వాసం, నమ్మకం, సహకారంతో ముందుకు నడవాల్సిన అవసరం ఉందన్నారు. అప్పుడే ప్రజాప్రయోజనాల ఆకాంక్షల మేరకు పరిపాలన సాధ్యపడుతుందన్నారు. 

ట్రంప్​ కెనడా, మెక్సికో, చైనా దేశాలపై వందకు వంద శాతం సుంకాలు విధిస్తామని ప్రకటించిన నేపథ్యంలో కెనడా, మెక్సికోల నుంచి ఈ ప్రతిక్రియ విడుదలైంది.