బిహార్​ ఉపాధికే ప్రథమ ప్రాధాన్యం

అక్టోబర్​ 2 జన్​ సూరజ్​ పార్టీ ఆవిష్కరణ 2025లో గెలుపై లక్ష్యంగా కార్యదర్శులతో సమావేశం ఎన్నికల వ్యూహ కర్త జేఎస్​ పీ అధినేత ప్రశాంత్​ కిషోర్​

Jul 28, 2024 - 17:38
 0
బిహార్​ ఉపాధికే ప్రథమ ప్రాధాన్యం

పాట్నా: బిహార్​ రాజకీయాల్లోకి అడుగిడి ప్రధానంగా స్థానిక ఉపాధి అవకాశాల కల్పనపై దృష్టి సారిస్తానని ఎన్నికల వ్యూహకర్త ప్రశాంత్​ కిషోర్​ అన్నారు. రాబోయే కాలంలో బిహార్​ కే ఉపాధి నిమిత్తం వచ్చేలా చర్యలు తీసుకుంటానని ప్రశాంత్​ కిషోర్​ స్పష్టం చేశారు. ఆదివారం జన్​ సూరజ్​ పార్టీ కార్యదర్శుల సమావేశాన్ని నిర్వహించారు. ఈ సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. అక్టోబర్​ 2 గాంధీ జయంతిన తన రాజకీయ ప్రస్తానాన్ని, పార్టీని ప్రారంభిస్తానన్నారు. 2025లో గెలుపే లక్ష్యంగా రానున్న అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేస్తామని చెప్పారు. 

కోటిమందితో జన్​ సూరజ్​ పార్టీ శంకుస్థాపనను చేసుకొందామని పార్టీ వర్గాలకు తెలిపారు. రాష్ర్ట వ్యాప్తంగా 1.50 లక్షలమంది కార్యదర్శులను నియమిస్తామన్నారు. ఇందులో నుంచి ప్రజలు బలపరిచే వ్యక్తులే నాయకులవుతారని తెలిపారు. ప్రజలు పార్టీలనో, వ్యక్తులనో, పాదాత్రలనో, ప్రచారాన్నో నమ్ముకోవద్దన్నారు. బిహార్​ కు మంచి ప్రత్యామ్నాయం, భవిష్యత్​ నీయగలిగిన వారు ఎవరో ఆలోచించుకొని తమతో కలిసి రావాలని ప్రజలకు విజ్ఞప్తి చేశారు. రానున్న ఎన్నికల్లో బిహార్​ బంగారు భవిష్యత్తుకు పట్టభద్రులనే నాయకులుగా ఎంపిక చేస్తానని ప్రశాంత్​ కిషోర్​ స్పష్టం చేశారు.