కుంభ్ మేళాను సందర్శించనున్న రాష్ట్రపతి, ప్రధాని, ప్రముఖులు
President, Prime Minister and dignitaries will visit Kumbh Mela

నా తెలంగాణ, న్యూ ఢిల్లీ: మహాకుంభ్ మేళాకు ఫిబ్రవరి 5న ప్రధానమంత్రి నరేంద్ర మోదీ సందర్శించే అవకాశం ఉంది. ఈ విషయం అధికారికంగా ఇంకా స్పష్టం కాకపోయినా పలువురు కేంద్రమంత్రులకు సంబంధించిన కుంభమేళా సందర్శన వివరాలను మంగళవారం మీడియాకు ప్రకటన విడుదలైంది.
కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా జనవరి 27న కుంభమేళాకు హాజరుకానున్నారు. ఉపాధ్యక్షుడు ధంఖర్ ఫిబ్రవరి 1న, రాష్ర్టపతి ద్రౌపదీ ముర్మూ ఫిబ్రవరి 10న మేళాను సందర్శించి త్రివేణి సంగమంలో పవిత్ర స్నానాలాచరించనున్నారు. ప్రత్యేక పూజల్లో పాల్గొంటారు. రాష్ర్టపతి, ప్రధానమంత్రి, కేంద్రమంత్రులు విచ్చేయనున్న సందర్భంగా పటిష్ఠ బందోబస్తును ఇప్పటినుంచే చేపట్టారు. కీల కూడళ్లు, కెమెరాలు, డ్రోన్లు, వేదికలు, స్నాన ఘట్టాల వద్ద తెల్లవార్లు నిఘాను ముమ్మరం చేశారు. మరోవైపు వీరి రాకపోకల సందర్భంగా సామాన్య భక్తులకు ఎలాంటి ఇబ్బంది కలగకుండా ప్రత్యేక జాగ్రత్తలు తీసుకోవాలని యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్ ఇప్పటికే అధికారులను ఆదేశించారు. జనవరి 20 నాటికే 9 కోట్లకు పైగా భక్తులు పుణ్యస్నానాలు ఆచరించినట్లు అధికారులు తెలిపారు.