బహ్రెయిచ్​ హింస ఇద్దరి ఎన్​ కౌంటర్​

తీవ్ర గాయాలు ఆసుపత్రిలో చికిత్స

Oct 17, 2024 - 15:50
Oct 17, 2024 - 18:12
 0
బహ్రెయిచ్​ హింస ఇద్దరి ఎన్​ కౌంటర్​
లక్నో: బహ్రెచ్​ లో రామ్​ గోపాల్​ చావుకు కారణమైన ఇద్దరిని పోలీసులు ఎన్​ కౌంటర్​ చేశారు. ఈ ఎన్​ కౌంటర్​ లో నిందితులు సర్పరాజ్​, తాలిబ్​ ల కాలికి బుల్లెట్​ గాయాలయ్యాయి. వారిని పోలీసులు ఆసుపత్రికి తరలించారు. గురువారం వీరిద్దరు నేపాల్​ పారిపోయేందుకు ప్రయత్నాల్లో ఉండగా సర్పరాజ్​ ఖాన్​, తాలిబ్​ లను పోలీసులు చుట్టుముట్టారు. నిందితులు కొత్వాలి నాన్​ పరా ప్రాంతం హండా బసేహరి కాలువ సమీపంలో పోలీసులకు తారసపడి కాల్పులకు పాల్పడగా, పోలీసులు ఎదురు కాల్పులు జరిపారు. కాల్పులు జరిగిన ప్రాంతం నుంచి నేపాల్​ కేవలం 40 కిలోమీటర్ల దూరం మాత్రమే. 
 
మరోవైపు అబ్దుల్​ హమీద్​ కుమారుడు కాల్పులకు పాల్పడుతున్న వీడియో కూడా బయటకు వచ్చింది. ఈ హత్య కేసులో మరో ఐదుగురిని పోలీసులు అరెస్టు చేశారు. అల్లర్ల అనంతరం నిందితుల కోసం ప్రత్యేక బృందాలు గాలింపు చేపట్టాయి. నిందితులు నేపాల్​ వెళ్లేందుకు ప్రయత్నిస్తున్నారనే విషయాన్ని కనిపెట్టాయి. ఈ రోజు ఉదయం వారి ఫోన్లు లొకేషన్​ లోకి రాగానే పోలీసులు తమ చర్య ప్రారంభించారు.