ఆర్జీకర్.. ప్రధాన నిందితుడినే దోషిగా నిర్ధారించిన కోర్టు
Arjikar.. The court convicted the main accused
ప్రధాన నిందితుడినే దోషిగా నిర్ధారించిన కోర్టు
దోషులను వదిలేశారు.. అమాయకున్ని ఇరికించారన్న రాయ్
అందరికీ శిక్ష పడే వరకు పోరాటం ఆగదు బాధితురాలి తండ్రి
కోల్‌కతా: కోల్‌కతా ఆర్జీకర్ మెడికోపై లైంగికదాడి, హత్య కేసులో ప్రధాన నిందితుడు సంజయ్ రాయ్ ను సీల్దా కోర్టు దోషిగా నిర్ధారించింది. శనివారం కేసును జస్టిస్ అనిర్బన్ దాస్ విచారించి తీర్పు వెలువరించారు. దోషికి శిక్షను సోమవారం (జనవరి 20)న ప్రకటిస్తామన్నారు. 162 రోజుల తరువాత ఈ కేసులో సీల్దా కోర్ట తీర్పు వెలువరించింది. కాగా సంజయ్ కు మరణశిక్ష విధించాలని సీబీఐ వాదిస్తున్నది. తీర్పు సందర్భంగా దోషి సంజయ్ మాట్లాడుతూ.. ఈ కేసులో తనను అన్యాయంగా ఇరికించారన్నారు. తాను ఈ ఘోరమైన ఆకృత్యానికి పాల్పడలేదన్నారు. దోషులను వదిలేశారని, అమాయకున్ని బలిచేశారని ఆవేదన వ్యక్తం చేశారు. ఆగస్ట్ 9న జరిగిన లైంగిక దాడిలో ఆసుపత్రి వాలంటీర్ అయి సంజయ్ ను పోలీసులు అరెస్టు చేశారు. ఈ సందర్భంగా 81 మంది సాక్షులలో 43 మందిని విచారించామని సీబీఐ కోర్టుకు తెలిపింది. ఈ సందర్భంగా బాధితురాలి తండ్రి మాట్లాడుతూ.. నిందితులందరికీ కఠిన శిక్ష ఖరారు చేసే వరకూ తాను కోర్టు తలుపులు తడుతూనే ఉంటానని అన్నారు. తన కుమార్తెపై ఈ దుశ్చర్య జరిగినప్పుడు నలుగురు పురుషులు, ఇద్దరు మహిళలు ఉన్నట్లుగా డీఎన్ ఏ నివేదిక పేర్కొందన్నారు. ఇందులో భాగస్వాములైన ప్రతీ ఒక్కరికీ శిక్ష పడేవరకూ తన పోరాటం ఆగదని తేల్చి చెప్పారు.
ఫోరెన్సిక్ నివేదిక ఆధారంగా కోర్టు సంజయ్ రాయ్ ని దోషిగా నిర్ధారించింది. రాయ్ శరీరంపై డీఎన్ ఏను కనుగొన్నట్లు నివేదికలో స్పష్టమైంది. అయితే సంజయ్ వాదన పట్ల న్యాయమూర్తి మాట్లాడుతూ.. శిక్ష ఖరారు చేసే ముందు సంజయ్ కు తన వాదన వినిపించేందుకు అవకాశం ఇస్తామని తెలిపారు.