పాక్ లో ఆత్మాహుతి దాడి భారత వ్యతిరేకి హక్కానీ మృతి
Anti-India Haqqani killed in suicide attack in Pakistan

ఇస్లామాబాద్: పాకిస్థాన్ లోని ఖైబర్ ఫంక్తూక్వా మసీదు బయట శుక్రవారం ఆత్మాహుతి దాడి జరిగింది. ఈ దాడిలో తాలిబన్ పితామహుడుగా భావించే మౌలానా సమీ ఉల్ హక్ కుమారుడు మౌలానరా హమీద్ ఉల్ హక్ మృతి చెందాడు. అఖోరా ఖట్టక్ ప్రాంతంలోని దారుల్ ఉలూమ్ హక్కానీ మదర్సాలో ప్రార్థనలు చేసుకొని బయటికి వచ్చిన సమయంలో ఈ ఆత్మాహుతి దాడి జరిగినట్లు పోలీసులు పేర్కొన్నారు. 15 మంది వరకు తీవ్ర గాయాలయ్యాయి. హమీద్ ఉల్ హక్కానీ పాక్ లోని హక్కానియా మదర్సాలకు అధిపతిగా వ్యవహరిస్తున్నాడు. ఇతను తరచూ భారత వ్యతిరేక ప్రకటనలు చేస్తూ వార్తల్లో నిలుస్తుంటాడు. మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉన్నట్లు పోలీసులు తెలిపారు. కాగా ఈ బాంబుదాడులకు ఇంకా ఏ ఉగ్రవాద సంస్థ బాధ్యత వహించలేదు.