క్రిమినల్ చట్టాల అమలుపై అమిత్ షా సమీక్ష
Amit Shah's review of the implementation of criminal laws

నా తెలంగాణ, న్యూ ఢిల్లీ: మూడు కొత్త క్రిమినల్ చట్టాల అమలుపై హోంమంత్రి అమిత్ షా సమీక్షించారు. మంగళవారం షా అధ్యక్షతన ఢిల్లీలో ఉన్నత స్థాయి సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సమవేశంలో నేషనల్ క్రైమ్ రికార్డ్స్ బ్యూరో, హోంశాఖ ఉన్నతాధికారులు, ఎన్ ఐసీ సీనియర్ అధికారులు పాల్గొన్నారు. జైళ్లు, కోర్టులు, ప్రాసిక్యూషన్, ఫోరెన్సిక్, సాక్ష్యం, సమన్లు వంటి విషయాలపై చర్చించారు. సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగించడం, కాలపరిమితి ప్రకారం దర్యాప్తు అధికారులతో పాటు సీనియర్ అధికారులకు హెచ్చరికలు పంపడం దర్యాప్తు ప్రక్రియను వేగవంతం చేయడంలో ఈ చట్టలు సహాయపడతాయన్నారు. సాంకేతిక ప్రాజెక్టుల అమలును మెరుగుపరచడానికి, సాధ్యమైన అన్ని రకాల సహాయం అందించడానికి హోం వ్యవహారాల మంత్రిత్వ శాఖ, ఎన్సీఆర్బీ నుంచి అధికారుల బృందం రాష్ట్రాలు/యుటిలను సందర్శించాలని అధికారులకు షా స్పష్టం చేశారు.ఈ చట్టాల పురగతిని పర్యవేక్షించేందుకు ఉన్నతాధికారులు నిరంతరం సమావేశాలు నిర్వహించాలన్నారు. సాంకేతిక అమలులో ఎన్సీఆర్బీ చేస్తున్న కృషిని అమిత్ షా అభినందించారు.