కాంగ్రెస్ ఎంపీ భార్యకు ఐఎస్ఐ, జార్జ్ సోరోస్ తో నిధులు
Funding for Congress MP's wife with ISI and George Soros

ఆరోపణలపై ఉన్నతస్థాయి విచారణకు బీజేపీ డిమాండ్
స్పందించేందుకు నిరాకరించిన ఎంపీ కార్యాలయ వర్గాలు
డీస్ఫూర్: కాంగ్రెస్ ఎంపీ గౌరవ్ గొగోయ్ భార్య ఎలిజబెత్ కోల్ బోర్న్ కు జార్జ్ సోరోస్, పాక్ ఐఎస్ ఐతో నిధులు సమకూరాయన్న ఆరోపణలపై దర్యాప్తు చేపట్టాలని బీజేపీ డిమాండ్ చేసింది. ఈ విషయంపై అసోం సీఎం హిమంత బిస్వా శర్మ ఆరోపణలు, పలు ప్రశ్నలు సంధించారు. విచారణలో నిజం నిగ్గు తేలుతుందన్నారు. కాగా ఈ విషయంపై పలు మీడియా సంస్థలు కూడా వివరాలను ప్రచురించాయి. దీంతో రాజకీయ దుమారం చెలరేగింది. కాగా ఆయా విషయాలపై పూర్తి ధృవీకరణ లభించలేదు. కోల్ బోర్న్ తన పదవీ కాలంలో పాక్ ఐఎస్ ఐ ద్వారా నిధులు సమకూరుతున్న ఒక ఎన్జీవో సంస్థతో కలిసి పనిచేసింది. ఈ సంస్థకు చీఫ్ గా పాక్ కు చెందిన అలీ తౌకీర్ షేక్ ఉన్నాడు. 2010 నుంచి 2015 మధ్య పలుమార్లు కోల్ బోర్న్ పాక్ లో సందర్శనలు చేపట్టి ఈ ఎన్జీవో ప్రాజెక్టు ద్వారా పనిచేశారు. అదే సమయంలో జార్జ్ సోరోస్ ఓపెన్ సొసైటీ ఫౌండేషన్ లతో కూడా ఈమెకు దగ్గరి బంధాలున్నాయి. వీటికి సంబంధించిన అనేక ఆర్థిక లావాదేవీలు దేశ భద్రతకు ముప్పుగా పరిణమించాయి. ఈ విషయాలపై ఎంపీ గౌరవ్ గొగోయ్ ను మీడియా ప్రశ్నలు సంధించగా మౌనమే సమాధానంగా నిలిచింది. చట్టపరమైన విషయం అంటూ ఆయన కార్యాలయ వర్గాలు వ్యాఖ్యానించేందుకు నిరాకరించాయి.