కేంద్రమంత్రికి విరిగిన సీటు!

The broken seat of the Union Minister!

Feb 22, 2025 - 12:41
 0
కేంద్రమంత్రికి విరిగిన సీటు!

ఎయిర్​ ఇండియాకు శివరాజ్​ సుతిమెత్తని మందలింపు

నా తెలంగాణ, న్యూ ఢిల్లీ: కేంద్రమంత్రి శివరాజ్​ సింగ్​ ఎయిర్​ ఇండియా విమానంలో విరిగిన సీటుపై కూర్చొని గంటన్నరపాటు ప్రయాణించారు. ఈ విషయాన్ని స్వయానా ఆయన శనివారం ట్వీట్​ చేసి ఎయిర్​ ఇండియాను సుతిమెత్తగా మందలించకనే మందలించారు. భోపాల్​ నుంచి ఢిల్లీకి ఎయిర్​ ఇండియా విమానంలో ప్రయాణించారు. ఆ సమయంలో సీటు సౌలభ్యంగా లేక కాస్త విరిగిపోయిందిగా ఆయన గమనించారు. విమాన సిబ్బంది ఆయనకు అదే సీటు కేటాయించారు. ఈ విషయంపై మంత్రి సిబ్బందిని ప్రశ్నించారు. విమానంలో ఇంకా ఇలాంటివి చాలా సీట్లే ఉన్నాయని, ఉన్నతాధికారులకు తెలిపామని సిబ్బంది సమాధానం ఇచ్చారు. దీంతో శివరాజ్​ సింగ్​ స్పందిస్తూ ఇంతడబ్బు పెట్టుకొని ప్రయాణిస్తున్న ప్రయాణికులకు సరైన సౌలభ్యాలు అందించకపోతే సంస్థకు నష్టం చేకూరుతుందన్నారు. ప్రయాణికుల నమ్మకం కోల్పోతామన్నారు. ఇలాంటీ సీట్లను ప్రయాణికులకు అందించవద్దన్నారు. కాగా ఈ సమయంలో ఆ విమానంలో ఉన్న పలువురు కేంద్రమంత్రికి తమ సీటులో కూర్చోవాలని విజ్ఞప్తి చేసినా కేంద్రమంత్రి అదే సీటులో కూర్చొని గంటన్నరపాటు ప్రయాణించారు. విషయాన్నంత సోషల్​ మాధ్యమంగా పెట్టడంతో పలువురు మంత్రి మందలింపు సరైందేనని ప్రశంసిస్తున్నారు. ఇప్పటికైనా ఎయిర్​ ఇండియా ఇలాంటి సీట్లను తొలగించి ప్రయాణికులకు సరైన సౌకర్యాలు కేటాయించాలని కోరుతున్నారు.