బడ్జెట్​ లో మైనార్టీలకు పెద్ద‘పీట’

A big 'seat' for minorities in the budget

Mar 7, 2025 - 13:50
 0
బడ్జెట్​ లో మైనార్టీలకు పెద్ద‘పీట’

ముస్లింలీగ్​ బడ్జెట్​ అన్న బీజేపీ
కర్ణాటక బడ్జెట్​ విడుదల చేసిన సీఎం సిద్ధరామయ్య

బెంగళూరు: కర్ణాటక బడ్జెట్​ లో మైనార్టీలకు సీఎం సిద్ధరామయ్య అత్యధిక ప్రాధాన్యమిచ్చారు. శుక్రవారం రాష్​ర్ట బడ్జెట్​ ను అసెంబ్లీలో ప్రవేశపెట్టారు. ఈ బడ్జెట్​ పూర్తిగా ‘ముస్లింలీగ్​’ బడ్జెట్​ అని బీజేపీ ఆరోపణలు, విమర్శలు గుప్పించింది.

బడ్జెట్​ లో కేటాయింపులు..
– వక్ఫ్ భూమి, శ్మశాన వాటికల పరిరక్షణ, నిర్వహణ కోసం రూ.150 కోట్లు కేటాయింపు.
– సీఎం మైనారిటీ కాలనీ అభివృద్ధి కార్యక్రమం కింద 25–-26 ఆర్థిక సంవత్సరంలో రూ.1000 కోట్లతో కార్యాచరణ ప్రణాళిక అమలు చేయబడుతుంది.
– ఆర్థికంగా బలహీనమైన మైనారిటీల వివాహాలకు ప్రతి జంటకు రూ. 50,000 సహాయం.
– హజ్ భవన్ కాంప్లెక్స్‌లో మరో భవన నిర్మాణం. 
–  250 మౌలానా ఆజాద్ మోడల్ ఇంగ్లీష్ మీడియం పాఠశాలల్లో ప్రీ-ప్రైమరీ నుంచి పీయూ వరకు తరగతులు దశలవారీగా ప్రారంభం. రూ. 500 కోట్లు. ప్రస్తుత సంవత్సరం రూ. 100 కోట్లు కేటాయింపు.
–  మదర్సాలలో మతపరమైన విద్యతో పాటు అధికారిక విద్యను అందించడానికి, ఎన్​ ఐఓఎస్​ ద్వారా విద్యార్థులను ఎస్​ఎస్​ఎల్పీ పరీక్ష రాయడానికి సిద్ధం చేయడానికి కంప్యూటర్లు, స్మార్ట్ బోర్డులు, ఇతర అవసరమైన మౌలిక సదుపాయాల కల్పన. 
– కర్ణాటక మైనారిటీల అభివృద్ధి సంస్థ ద్వారా మైనారిటీ యువత కొత్త స్టార్టప్‌లను ప్రారంభించడానికి ప్రోత్సాహం. 
– ముఖ్యమంత్రి మైనారిటీ కాలనీ అభివృద్ధి కార్యక్రమం కింద రూ.1,000 కోట్లతో కార్యాచరణ ప్రణాళిక. 2025–-26లోనే పనుల నిర్వహణ.
– జైన పూజారులు, సిక్కుల ప్రధాన గురువులు, మసీదుల పేష్-ఇమామ్‌లకు గౌరవ వేతనం నెలకు రూ.6,000కు పెంపు. 
–  మైనారిటీ వర్గాల సాంస్కృతిక, సామాజిక కార్యకలాపాలను నిర్వహించడానికి రాష్ట్రవ్యాప్తంగా బహుళార్ధసాధక మందిరాలు నిర్మించబడతాయి. హూబ్లీ తాలూకా స్థాయిలో రూ.50 లక్షలతో, జిల్లా ప్రధాన కార్యాలయాలు, మునిసిపల్ కార్పొరేషన్ ప్రాంతాలలో కోటి రూపాయలతో భవనాల నిర్మాణం. 
– కలబురగి జిల్లాలోని చిత్తపుర తాలూకాలోని పురాతన బౌద్ధ కేంద్రమైన సన్నతిలో అభివృద్ధి అథారిటీ ఏర్పాటు. 
– ఐదు ప్రభుత్వ హామీల కొనసాగింపునకు రూ. 51,034 కోట్ల కేటాయింపు.

మండిపడ్డ బీజేపీ.. 
కర్ణాటక బడ్జెట్ పై బీజేపీ జాతీయ అధికార ప్రతినిధి ప్రదీప్ భండారి మండిపడ్డారు. ఇది ప్రజలు మెచ్చిన బడ్జెట్​ కాదని ‘ముస్లింలీగ్​ బడ్జెట్​’ అని ఆరోపించారు. ఇమామ్​ లకు వేతనాలు, వక్ఫ్​ కు కేటాయింపులు, మైనార్టీలకు కేటాయింపులు చేస్తూ పాక్​ లోని జిన్నా ప్రభుత్వాన్ని తలపించేలా బడ్జెట్​ లో కేటాయింపులు ఉన్నాయని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇది ముమ్మాటికీ రాజ్యాంగ విలువలను కాలరాయడమేనన్నారు.