బీజాపూర్​ లో ఎన్​ కౌంటర్​ 31 మంది నక్సల్స్​, ఇద్దరు జవాన్లు మృతి

కొనసాగుతున్న కూంబింగ్​

Feb 9, 2025 - 13:14
Feb 9, 2025 - 14:16
 0
బీజాపూర్​ లో ఎన్​ కౌంటర్​ 31 మంది నక్సల్స్​, ఇద్దరు జవాన్లు మృతి

కొనసాగుతున్న కూంబింగ్​

రాయ్​ పూర్​: చత్తీస్​ గఢ్​ బీజాపూర్​ లో నక్సల్స్​ కు మరోమారు భారీ ఎదురుదెబ్బ తగిలింది. ఆదివారం వేకువజాము నుంచి కొనసాగుతున్న ఎన్​ కౌంటర్​ లో 31 మంది నక్సలైట్లను భద్రతదళాలు మట్టుబెట్టాయి. కూంబింగ్​ కొనసాగుతుండడంతో ఈ సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉంది. నేషనల్ పార్క్​ అడవుల్లో భద్రతాదళాలు కూంబింగ్​ చేస్తుండగా నక్సల్స్​ కాల్పులకు తెగబడ్డారు. దీంతో ఎదురుకాల్పుల్లో భారీ ఎత్తున నక్సలైట్లు హతమయ్యారు. ఈ ఎన్​ కౌంటర్​ లో నలుగురు భద్రతా సిబ్బందికి తీవ్ర గాయాలయ్యాయి. చికిత్స నిమిత్తం వీరిని బీజాపూర్​ లోని నారాయణ్​ పూర్​ ఆసుపత్రికి తరలించగా అక్కడ చికిత్స పొందుతూ ఇద్దరు జవాన్లు మృతి చెందారు. నక్సల్స్​ వ్యతిరేక ఆపరేషన్​ నారాయణ్​ పూర్​ ఆనుకుని ఉన్న మహారాష్ర్ట సరిహద్దు ఇంద్రావతీ జాతీయ ఉద్యానవనం అడవి ప్రాంతాల్లో జరిగింది. ఎన్​ కౌంటర్​ స్థలం నుంచి భారీ ఎత్తున ఆటోమేటిక్​ ఆయుధాలను స్వాధీనం చేసుకున్నట్లు బస్తర్​ రేంజ్ ఐజీ సుందర్​ రాజ్, ఎస్పీ జితేంద్ర యాదవ్​ తెలిపారు.  ఈ ఆపరేషన్​ లో వెయ్యిమంది భద్రతా దళాలు పాల్గొన్నట్లు సమాచారం. మరింతమంది నక్సల్స్​ మృతి చెందే అవకాశం ఉందని తెలుస్తుంది. ఆ ప్రాంతంలో కూంబింగ్​ కొనసాగుతుండడంతో పూర్తి వివరాలు అందజేసేందుకు ఇంకా సమయం పట్టవచ్చని అధికారులు తెలిపారు.