205 మంది భారతీయులు వెనక్కు!

అమృత్​ సర్​ కు చేరనున్న అమెరికా సీ–17 విమానం

Feb 4, 2025 - 12:07
 0
205 మంది భారతీయులు వెనక్కు!

నా తెలంగాణ, న్యూ ఢిల్లీ: అమెరికాలో చట్ట విరుద్ధంగా నివసిస్తున్న 205 మంది భారతీయులను వెనక్కు పంపారు. సోమవారం రాత్రి యూఎస్​ వైమానిక దళానికి చెందిన సీ–17 విమానంలో వీరంతా బయలుదేరారు. విమానం మంగళవారం సాయంత్రానికి అమృత్​ సర్​ కు చేరుకోనుంది. ట్రంప్​ అధికారం చేపట్టిన 11 రోజుల్లోనే 25వేల మందికి పైగా అక్రమ వలసదారులను అదుపులోకి తీసుకొని వారి వారి దేశాలకు పంపుతున్నారు.అక్రమ వలసదారులపై అమెరికాతో సహకరిస్తామని భారత్​ కూడా ట్రంప్​ వాదనతో ఏకీభవించింది. వీరిని గుర్తించడంలో భారత్​ కూడా పాల్గొంది. ఇమ్మిగ్రేషన్ అండ్ కస్టమ్స్ ఎన్‌ఫోర్స్‌మెంట్ (ఐసీఇ)  15 లక్షల మంది అక్రమ వలసదారుల జాబితాను సిద్ధం చేశారు. ఈ జాబితా ప్రకారం 12 రాష్ర్టాల్లో దాడులు నిర్వహించి అక్రమవలసదారులను అదుపులోకి తీసుకున్నారు. ఇందులో 18,000 మంది భారతీయులు కూడా ఉన్నారు. ఇప్పటికే 1700మంది భారతీయులను అదుపులోకి తీసుకున్నారు. వీరిని దశల వారీగా భారత్​ కు తిరిగి పంపనున్నారు. మరోవైపు మెక్సికో, కెనడా సరిహద్దుల నుంచి చొరబాట్లు 94 శాతం మేర తగ్గినట్లు అమెరికా రక్షణ శాఖ వెల్లడించింది. బైడెన్​ హయాం జనవరి 19 నుంచి ట్రంప్​ అధికారం చేపట్టే వరకూ రోజుకు 2087 మంది చొరబాట్లు జరిగినట్లు గుర్తించారు.ప్రస్తుతం ఆ సంఖ్య 126గా ఉందన్నారు. ఒక్క వ్యక్తి కూడా అక్రమంగా అమెరికాలోకి ప్రవేశించకూడదని ట్రంప్​ అధికారులకు స్పష్టం చేశారు.