అమెరికాకు చైనా ఝలక్​! దిగుమతులపై 15 శాతం సుంకం విధింపు

China Jhalak to America! 15 percent levy on imports

Feb 4, 2025 - 12:19
Feb 4, 2025 - 15:48
 0
అమెరికాకు చైనా ఝలక్​! దిగుమతులపై 15 శాతం సుంకం విధింపు

ఏకపక్ష నిర్ణయానికి డ్రాగన్ ధీటైన సమాధానం
మెక్సికో, కెనడాలపై వెనక్కు, డ్రాగన్ మెడపై సుంకాల కత్తి
తమ ప్రయోజనాలను కాపాడుకుంటామన్న చైనా

బీజింగ్:  ట్రంప్ చర్యపై చైనా స్పందించింది. అమెరికా నుంచి చైనాకు దిగుమతి అవుతున్న బొగ్గు, ఎల్ జీ, ముడి చమురుపై 15 శాతం సుంకాన్ని విధించి ప్రపంచ పెద్దన్న (డోనాల్డ్ ట్రంప్) కుఝలక్ ఇచ్చింది. ఇతర ఉత్పత్తులపై 10 శాతం సుంకాన్ని విధిస్తున్నట్లు ప్రకటించారు. మెక్సికో, చైనా కంటే ఒక అడుగు ముందుకువేసి చైనా ఏకంగా రంగంలోకి దిగి తన సత్తా చాటిందని, ఇక అమెరికా–చైనాల మధ్య ఉప్పు నిప్పులాంటి పరిస్థితులు ఉత్పన్నం అయ్యే అవకాశం లేకపోలేదని నిపుణులు నిర్ధారించారు. అటు చైనా ఎదురుదాడితో ట్రంప్ రుసరుసలాడుతున్నట్లు సమాచారం. ట్రంప్ అధ్యక్షుడిగా ప్రమాణ స్వీకారం చేయగానే కెనడా, మెక్సికో, చైనాలపై సుంకాలు విధించే కార్య నిర్వాహక ఉత్తర్వులపై సంతకాలు చేశారు. ఫిబ్రవరి 1 నుంచి సుంకాలు అమల్లోకి వచ్చాయి. కానీ మెక్సికో, కెనడా ఆందోళనల దృష్ట్యా ఈ నిర్ణయాన్ని అమెరికా ఒక నెలపాటు ఉపసంహరించుకుంది. చైనాపై మాత్రం సుంకాల పరిమితిని కొనసాగించాలని నిర్ణయించింది. దీంతో చైనా అమెరికాకు ధీటుగా సుంకాల ప్రకటనను విడుదల చేసింది. అమెరికా తప్పుడు సాంకేతికపై చట్టపర్యమైన చర్యలు తీసుకుంటామని చైనా ప్రకటించింది. తమదేశ ప్రయోజనాలను కాపాడుకుంటామని ప్రకటించారు. ట్రంప్ నిబంధనలు చైనాకు నష్టం కలుగుతున్నాయని స్పష్టం చేసింది. పనామా కాలువలు, అక్రమ చొరబాట్లు, ఫెంటానిల్ అనే ప్రమాదకర మందు చైనా కూడా తమ దేశంలోకి చొప్పిస్తుందని ఇలాంటి అనేక ఆరోపణల నేపథ్యంలో ట్రంప్ చైనాపై చర్యలకు ఉపక్రమించారు. ఏది ఏమైనా ట్రంప్ సుంకాల నిర్ణయం కాస్త ఇటు చైనాకు నష్టం కలిగించనుండగా, అటు ట్రంప్ వ్యూహం ఏంటో తెలియక విశ్లేషకులు సైతం తలలు పట్టుకుంటున్నారు.