ఎమ్మెల్యే కుమారుడి ఆత్మహత్య

Suicide of MLA's son

Feb 3, 2025 - 14:58
 0
ఎమ్మెల్యే కుమారుడి ఆత్మహత్య

పాట్నా: బిహార్​ కడ్వా నియోజకవర్గ కాంగ్రెస్​ ఎమ్మెల్యే షకీల్​ అహ్మాద్​ ఖాన్​ కుమారుడు అయాన్​ ఖాన్​ (18) ఆత్మహత్య చేసుకున్నాడు. గార్దానీబాగ్​ లోని నివాసంలో సోమవారం ఉదయం అయాన్​ ఖాన్​ మృతదేహం వేలాడుతూ కనిపించింది. దీంతో కుటుంబ సభ్యులు, పనిమనుషులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. పోలీసులు ఆత్మహత్యకు గల కారణాలపై ఆరా తీస్తున్నారు. కాగా ఆదివారం షకీల్​ అహ్మద్​ ఇంట్లో లేరు. సోమవారం విషయం తెలుసుకున్న ఆయన హుటాహుటీన ఇంటికి వచ్చి కుమారుడి ఆత్మహత్యపై తీవ్ర శోకం వ్యక్తం చేశారు. అయాన్​ ఖాన్​ ఆత్మహత్య పట్ల పలువురు రాజకీయ, వ్యాపార ప్రముఖులు షకీల్​ ఖాన్​ ను పరామర్శించారు. బీజేపీ నేత షానవాజ్​ హుస్సేన్​ షకీల్​ ను పరామర్శించారు. ఈ ఘటన దురదృష్టకరమన్నారు. అయాన్​ ఖాన్​ ఓ మంచి విద్యార్థిగా తనకు తెలుసన్నారు. షకీల్​ కు అతను ఒక్కడే కుమారుడని ఆన బాధ వర్ణనాతీతమని తెలిపారు.